Maha Shivratri 2024 Lingashtakam: మహాశివరాత్రి రోజు ఈ లింగాష్టకాన్ని చదివితే అష్ట దరిద్రం, సమస్యలు తొలగిపోవడం ఖాయం..

Maha Shivratri 2024 Lingashtakam In Telugu: ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8వ తేదీన వచ్చింది. అయితే శివ భక్తులంతా శివ నామ స్మరణతో జాగారాలు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో లింగాష్టకాన్ని చదవడం వల్ల అనేక రకాల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శివారాధనలో భాగంగా ఈ లింగాష్టకాన్ని పాటించడం వల్ల జీవితంలో కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరడమే కాకుండా సమస్యలన్నీ సులభంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా ఆ మహా శివుడి అనుగ్రహం కూడా లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే లింగాష్టమికి సంబంధించిన పూర్తి పూర్తి అర్థాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1 /9

మొదట లింగాష్టకం బ్రహ్మ మురారి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి తెలుగులో అర్థం ఏమిటంటే బ్రహ్మ విష్ణువుల చేత పూజలు అందుకున్న లింగమని పండితులు చెబుతున్నారు. ఈ లింగాష్టకం లోని నాలుగవ పేరా ఓ సదాశివ లింగం నీకు నమస్కారమనే అర్ధాన్ని కలిగి ఉంటుంది.  

2 /9

లింగాష్టకములోని ఐదవ పేరాలో "దేవముని పవ్రావరార్చిత లింగం" అంటే మహా ఋషులతోపాటు దేవదేవతలు పూజించిన లింగం అని అర్ధాన్నిస్తుంది.   

3 /9

ఇక ఈ అష్టకంలోని తొమ్మిదవ పేరాలో ఉండే "సర్వ సుగంధ సులేపిత లింగం" అంటే.. మంచి గంధం తో పాటు లేపనాలతో పూసిన మహా శివలింగం అని ప్రత్యేకమైన అర్ధాన్నిస్తుంది.  

4 /9

ఇక లింగాష్టకంలోని 14వ పేరా "కనక మహామణి భూషిత లింగం" అంటే మనులతోపాటు బంగారంతో అలంకరించిన మహా లింగం అని అర్ధాన్నిస్తుంది. మొత్తంగా ఈ లింగం వజ్రా వైడూర్యాలతో కలిగిన లింగంగా భావించవచ్చు.

5 /9

ఇక ఈ లింగాష్టకం లోని 18వ పేరాలు "కుంకుమ చందన లేపిత లింగం" అంటే కుంకుమ తో పాటు గంధాన్ని మిశ్రమంలో అలంకరించిన లింగంగా భావించవచ్చు.  

6 /9

లింగాష్టకం లోని 22వ పేరాలో "దేవగణార్చిత సేవిత లింగం" అంటే.. ఎల్లప్పుడూ దేవగణాలతో కొలిచిన లింగంగా అర్ధాన్నిస్తుంది. అంతేకాకుండా దేవతలందరూ ఎల్లప్పుడూ పూజించే లింగంగా కూడా భావించవచ్చు.  

7 /9

ఇక 26వ పేరా "అష్టదలోపేతర వేష్టిత లింగం" అంటే.. లింగం ఎప్పుడు ఎనిమిది రకాల ఆకులపై నివాసం ఉంటుందని ప్రత్యేకమైన అర్ధాన్నిస్తుంది. అందుకే శివ పూజలో భాగంగా ఆకులను వినియోగిస్తారు.  

8 /9

ఇక లింగాష్టకం లోని చివరి పేరా "సురవర పూజిత లింగం" అంటే.. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బృహస్పతి చేత ఇతర దేవతల చేత పూజలు అందుకున్న లింగంగా భావించవచ్చు.

9 /9

ఈ లింగాష్టకాన్ని శివరాత్రి రోజున జాగారం ఉండేవారు తప్పకుండా చదవడం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి.