Milk Benefits: పాలను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. రాత్రి పడుకునే ముందు, ఉదయం వేళ తాగితే అద్భుతమైన లాభాలు కలుగుతాయి. పాలలో కొన్ని పదార్ధాలు కలిపి తాగితే ఇంకా మెరుగైన ఫలితాలు కలుగుతాయి.
ఇలాచీ పాలు ఇలాచీ పాలు తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. దీనివల్ల శరీరానికి కావల్సిన ఐరన్, పోషకాలు సమృద్ధిగా అందుతాయి.
పసుపు పాలు పాలతో శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి. శరీరంలోని చాలా వ్యాధులు తృటిలో దూరమౌతాయి. ముఖ్యంగా పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల ఏ విధమైన సీజనల్ వ్యాధులు దరిచేరవు
ఫ్రూట్ మిల్క్ పాలలో పండ్లు కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని బలహీనత పూర్తిగా దూరమౌతుంది. ఎముకలకు బలం చేకూరుతుంది.
దాల్చినచెక్క పాలు దాల్చినచెక్కను పాలలో కలుపుకుని తాగడం వల్ల నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. ఒత్తిడి, ఆందోళన కూడా దూరమౌతాయి.
బాదం పాలు బాదం పాల వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. దీనివల్ల బ్రెయిన్, హార్ట్, స్కిన్ అన్నీఆరోగ్యంగా ఉంటాయి.