Maha Shivaratri - Heroes as Aghora: విశ్వక్‌సేన్, చిరంజీవి,బాలకృష్ణ సహా 'అఘోర' పాత్రలో మెప్పించిన హీరోలు వీళ్లే..

Maha Shivaratri - Heroes as Aghora: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అఘోర అనే పదం కామన్ అయిపోయింది. మన హీరోలు ఇపుడు వరుసగా అఘోర పాత్రల్లో నటిస్తున్నారు. అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో జీవించారు. దీంతో అందరు అఘోరలు ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విశ్వక్‌సేన్.. 'గామి' చిత్రంలో అఘోర పాత్రలో నటించారు. అఘోరలను శివుడి అంశంగా భావిస్తారు. వీళ్లను శివధూతలుగా భావిస్తారు. ఈ సందర్భంగా తెలుగు తెరపై శివుడి అంశ అయిన అఘోర పాత్రల్లో నటించిన హీరోలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..

1 /6

  విశ్వక్‌సేన్ గామి సినిమాలో తొలిసారి అఘోర పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఎంతో ఈజ్‌తో నటించాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

2 /6

అఖండ సినిమాలో అఘోర పాత్రలో నటించడం అనే కంటే బాలయ్య జీవించాడనే చెప్పాలి. ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాదు.. అఘోర పాత్రలో బాలయ్య అద్భుతం అనేలా చేసింది. ఇప్పటి వరకు ఈ క్యారెక్టర్ చేసిన నటుల్లో బాలయ్య ఓ అడుగు ముందున్నాడు. ఈ తరహా పాత్రల్లో నటించడం అంత ఈజీ కాదు. కానీ బాలకృష్ణ మాత్రం అఖండ చేసిన పాత్ర చూసిన తర్వాత మరొకరిని అందులో చూడటం కష్టమనే చెప్పాలి.

3 /6

  మెగాస్టార్ చిరంజీవి.. శ్రీమంజునాథలో క్లైమాక్స్‌ ముందు వచ్చే సన్నివేశంలో అఘోర పాత్రలో కనిపించి దడదడ లాడించారు. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి పౌరాణిక పాత్ర అయిన మహా శివుడి పాత్రలో నటించారు.

4 /6

నాగార్జున.. ఢమరుకం సినిమాలో ఓ సన్నివేశంలో అఘోర పాత్రలో కనిపిస్తారు. అటు శ్రీ ఆదిశంకరా చార్యుల సినిమాలో చంఢాలుడి వేషంలో కనిపించారు.

5 /6

వెంకటేష్.. నాగవళ్లి సినిమాలో సైక్రియాటిస్ట్ పాత్రతో పాటు అహంకారి అయిన రాజు పాత్రలో నటించారు. అందులో రాజు అఘోరగా మారతాడు. క్లైమాక్స్‌లో అఘోరగా కనిపిస్తారు వెంకటేష్.

6 /6

అరుంధతి సినిమాలో సోను సూద్.. బొమ్మాళి అంటూ అఘోర పాత్రలో భయపెట్టాడు. అటు నాగబాబు అఘోర టైటిల్‌తో ఓ సినిమా కూడా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలైందనే విషయం చాలా మందికి తెలియదు. నేనే దేవుణ్ణి సినిమాలో ఆర్య.. హీరో శ్రీరామ్, అటు అహం బ్రహ్మస్మీ సినిమాల మంజు మనోజ్ అఘోరా పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నడస్తోంది. మొత్తంగా అఘోర పాత్రలో నటించడం అంత ఈజీ కాదనే చెప్పాలి.