Lungs Detox Tips in Telugu: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ధూమపానం కారణంగా లంగ్స్ దెబ్బతినడం ఎక్కువగా ఉంది. ఊపిరితిత్తులు బలహీనమైతే తరచూ కఫం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తవచ్చు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చూద్దాం.
Lungs Detox Tips in Telugu: శరీరంలోని వివిధ అంగాల్లో పేరుకుపోయే వ్యర్ధాలు లేదా విష పదార్ధాలను తొలగిస్తుండాలి. దీనినే డీటాక్సిఫికేషన్ అంటారు. లంగ్స్ డీటాక్స్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాయి. లంగ్స్ దెబ్బతినకుండా నియంత్రించేందుకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు ఈ అలవాట్లు పాటించాలి.
లంగ్స్ డీటాక్స్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే శరీరంలో లంగ్స్ అతి ముఖ్యమైన అంగం. శ్వాస ప్రక్రియకు ఇదే మూలం. లంగ్స్‌లో సమస్య ఉంటే శ్వాసలో ఇబ్బంది ఏర్పడి ప్రాణాంతకం కావచ్చు. అందుకే అన్నింటికంటే ముఖ్యంగా లంగ్స్ హెల్తీగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ఎప్పటికప్పుడు లంగ్స్ డీటాక్స్ చేస్తుండాలి
మీ డైట్‌లో ఎప్పుడూ పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్ధాలుండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా తాజా పండ్లు, ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలు, తృణధాన్యాలు అథికంగా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు. లంగ్స్ స్వెల్లింగ్ తగ్గిస్తాయి. వీలైనంతవరకూ ఫ్రై పదార్ధాలు, ప్రోసెస్డ్ ఫుడ్స్ నిలిపివేయాలి
లంగ్స్ డీటాక్స్ చేసేందుకు, సామర్ధ్యం పెంచేందుకు అత్యుత్తమ పద్ధతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ధూమపానానికి దూరంగా ఉండాలి. గతంలో ధూమపానం చేసి మానేసినవారు వ్యాయామం ద్వారా లంగ్స్ క్లీన్ చేయవచ్చు.
లంగ్స్ డీటాక్స్ చేసేందుకు మరో అద్భుతమైన మార్గం హెర్బల్ టీ లేదా నిమ్మరసం. నిమ్మరసం, తేనె కలిపిన అల్లం టీ ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దోహదం చేస్తాయి. శొంఠి కూడా శ్వాస సంబంధ సమస్యల్ని నయం చేయగలదు. లంగ్స్ క్లీన్ చేయడంలో ఈ పదార్దాలు అద్భుతంగా ఉపయోగపడతాయి.
అల్లం వెల్లుల్లి సూప్ బాగా పనిచేస్తుంది. దీని కోసం చిన్న చిన్న ముక్కలు చేసిన మాంసం, వెల్లుల్లి,మిరియాలతో సేవిస్తే బాగుంటుంది. లంగ్స్‌లో పేరుకునే విషపదార్ధాలను బయటకు పంపిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లంగ్స్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పసుపు మిరియాల పాలు మరో మంచి ప్రత్యామ్నాయం. ముఖ్యంగా చలికాలంలో పసుపు, మిరియాల పౌడర్ కలిపిన పాలు తాగడం వల్ల లంగ్స్‌లో పేరుకున్న టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది
తరచూ దగ్గు, జలుబు సమస్య ఉంటే రోజూ పడుకునే ముందు ఆవిరి పడితే మంచి ఫలితాలుంటాయి. వేడి నీటిలో 3-4 చుక్కల కర్పూరం నూనె వేసి ఆవిరి పట్టాలి. దీని వల్ల ఛాతీ బిగుతుదనం నుంచి ఉపశమనం కలుగుతుంది. పల్మనరీ ఎడీమా నుంచి విముక్తి లభిస్తుంది.
ధూమపానం అనేది లంగ్స్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇందులో ఉండే హానికారక రసాయనాలు లంగ్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానానికి దూరంగా ఉండాలి.