Lakshmi Manchu Daughter Vidya Nirvana: మంచు లక్ష్మి కుమార్తె అరుదైన ఘనత

  • Dec 20, 2020, 09:10 AM IST

Lakshmi Manchu Daughter Nirvana | టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ(6) అరుదైన ఘనతను సాధించింది. అత్యంత పిన్న వయస్కురాలైన చెస్‌ ట్రైనర్‌గా మంచు లక్ష్మి కూతురు నిర్వాణ ‘నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకోవడం విశేషం.

1 /6

టాలీవుడ్ నటి మంచు లక్ష్మి (Lakshmi Manchu) కుమార్తె విద్యా నిర్వాణ(6) అరుదైన ఘనతను సాధించింది. అత్యంత పిన్న వయస్కురాలైన చెస్‌ ట్రైనర్‌గా మంచు లక్ష్మి కూతురు నిర్వాణ ‘నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకోవడం విశేషం. Gallery: Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ

2 /6

మనవరాలు విద్యా నిర్వాణ తాజాగా సాధించిన ఘనతతో టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌బాబు (Mohan Babu) కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

3 /6

నోబెల్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ ప్రతినిధి డాక్టర్ చోకలింగం బాలాజీ సమక్షంలో నిర్వహించిన పరీక్షలో ఆరేళ్ల చిన్నారి, తెలుగు తేజం విద్యా నిర్వాణ ఉత్తీర్ణత సాధించింది.

4 /6

కూతురు విద్యా నిర్వాణ (Vidya Nirvana) సాధించిన ఘనతపై నటి మంచు లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. తల్లిగా తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు కుమార్తె సాధించిన ఘనతను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు.

5 /6

తల్లిదండ్రులు తమ పిల్లలను వారి లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని నటుడు మోహన్ బాబు సూచించారు. విద్యా నిర్వాణ సాధించిన ఈ ఘనతపై మంచు వారి కుటుంబసభ్యులతో పాటు తెలుగు ప్రజలు, టాలీవుడ్ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Gallery: Pawan Kalyan వకీల్ సాబ్ మూవీ స్టిల్స్ వైరల్