Kumbha Mela 2025 Helicopter Services: హిందూ అతిపెద్ద జాతర మహాకుంభమేళా ప్రారంభమైంది నేటి నుంచి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్‌లో భక్తులతో కిటకిటలాడుతుంది. 45 రోజుల పాటు నిర్వహించే ఈ మహా కుంభమేళకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. అయితే దీన్ని హెలికాప్టర్ లో కూడా ఈ కుంభమేళా దృశ్యాలను తిలకించవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
రూ. 1296 కే హెలికాప్టర్ ను బుక్ చేసుకుంటే మహా కుంభమేళను సులభంగా వీక్షించవచ్చు. గతంలో రూ.3000 టికెట్ ధర ఉండేది. ప్రస్తుతం ఈ టికెట్ ధరను తగ్గించేశారు. హెలికాప్టర్ ద్వారా ఎనిమిది నిమిషాల పాటు కుంభమేళా దృశ్యాలను తిలకించవచ్చు. జనవరి 13 నుంచి ఈ హెలికాప్టర్ సేవలను బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు.
ఈ హెలికాప్టర్ సేవలను బుక్ చేసుకోవడానికి యూపీఎస్టీడీసీ (www.upstdc.co.in) అధికారిక వెబ్సైట్లో సులభంగా బుక్ చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ పవన్ హాన్స్ ఈ సేవలను అందిస్తుంది. హెలికాప్టర్ దృశ్యాలతో మరువలేని అనుభవాన్ని భక్తులకు కల్పిస్తోంది. ఇది కాకుండా టూరిజం కల్చర్ డిపార్ట్మెంట్ ఇక్కడ కొన్ని థ్రిల్లింగ్ అనుభవాలను కూడా భక్తులకు అందించనున్నాయి. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ గా రానిస్తోంది
జనవరి 24 నుంచి 26 వరకు డ్రోన్ షో, లేజర్ షో వంటివి కూడా నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని త్రిల్లింగ్ యాక్టివిటీలు కూడా నిర్వహించనున్నారు. కుంభమేళాకు వచ్చినవారికి దేశంలో నలుమూలన నుంచి ప్రఖ్యాతి గాంచిన ఆర్టిస్టులతో ప్రత్యేక షోలు కూడా తిలకించవచ్చు. ఇక్కడ కొన్ని షోలు నిర్వహిస్తున్నారు
గంగా పండల సందర్భంగా జనవరి 16న శంకర్ మహదేవన్ షో కూడా ఉంటుంది. అయితే మహాకుంభమేళకు భక్తుల తాకిడి పెరగడంతో హనుమాన్ టెంపుల్ దర్శనాన్ని రద్దు చేశారు. ముఖ్యంగా మూడు రోజులపాటు జనవరి 14 సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి.. 3 రోజులపాటు ఈ హనుమాన్ టెంపుల్ దర్శనం భక్తులకు అందదు.
ఈ మహాకుంభమేళాకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. అండర్ వాటర్ డ్రోన్స్, ఏఐ కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నారు. త్రివేణి సంగమంలో ఈ మేళా జరుగుతుంది. ఇక మహాకుంభమేళాకు దాదాపు 44 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా..