Kriti Sanon: బాలీవుడ్ భామ అయిన కృతి సనన్.. తెలుగు సినీ ఇండస్ట్రీతోనే కథానాయికగా తన నట ప్రస్థానం మొదలు పెట్టింది. అంతేకాదు హీరోయిన్ గా తక్కువ సమయంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.
ఢిల్లీలో పుట్టి పెరిగిన కృతి సనన్.. తెలుగులో మహేష్ బాబు సరసన నేనొక్కడినే, నాగ చైతన్యకు జోడిగా దోచెయ్ మూవీలో నటించింది. ఆ తర్వాత తెలుగు హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ మూవీలో నటించి మెప్పించింది.
మొత్తంగా కృతి సనన్ తెలుగులో హీరోలకు ఐరన్ లెట్ గా మారిందనే కామెంట్స్ వినిపించాయి. టాలీవుడ్ హీరోలతో నటించిన సినిమాలేవి పెద్దగా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు.
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా టాలీవుడ్ లో రచ్చ చేసినా కృతికి ఆదరణ దక్కలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లో కథానాయికగా సత్తా చాటుతూనే ఉంది.
కృతి సనన్.. తెలుగులో మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనొక్కడినే' వన్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.
కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలో 2021 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది కృతి సనన్.