Keerthy Suresh Assets: మ‌హాన‌టి కీర్తి సురేష్‌కు ఇన్ని కోట్ల ఆస్తులున్నాయా.. ? మైండ్ బ్లాంక్ చేస్తోన్న ఆస్తుల చిట్టా ..

Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో తెలుగులో ఆమె ఇమేజ్ ఆకాశం అమాంతం ఎదిగింది.   మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగు వాళ్ల హృద‌యాల్లో చోటు సంపాదించుకుంది. మహానటి సినిమాతో నేష‌న‌ల్ అవార్డు ఈమెను వ‌రించింది.  ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇన్నేళ్ల కెరీర్‌లో ఈమె ఆస్తుల విలువ కూడా అదే రేంజ్‌లో పెరిగాయినేది ఇన్ సైడ్ టాక్. 

1 /9

కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో ఈమె బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక త‌న సొంత భాష‌ మలయాళ 'గీతాంజలి' మూవీతో క‌థానాయిక‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో కీర్తి సురేష్ యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి.

2 /9

తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ 'నేను శైలాజా'. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది. తెలుగులో కాస్త గ్యాప్‌తో పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు.

3 /9

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీలో సావిత్రి పాత్ర‌లో ప‌ర‌కాయ ప్రవేశం చేసింది. ఈ సినిమాలోని నటనకు కీర్తి సురేష్ కు జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది.

4 /9

గ‌తేడాది తెలుగులో నాని సరసన దసరా మూవీతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీలో చిరు చెల్లెలు పాత్ర‌లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.

5 /9

ఇక మహేష్ బాబు సరసన పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.  

6 /9

ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇన్నేళ్ల కెరీర్‌లో కీర్తి సురేష్ బాగానే వెన‌కేసింది. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం.

7 /9

అంతేకాదు త‌న‌కు వ‌చ్చిన సంపాద‌న‌లో మ్యూచువ‌ల్ ఫండ్స్, రియ‌ల్ ఎస్టేట్స్ వ్యాపారాల్లో కీర్తి సురేష్ పెట్టుబడులు పెట్టిన‌ట్టు స‌మాచారం. ఈ లెక్క‌న ఈమె దాదాపు రూ.100 కోట్ల వ‌ర‌కు కేవ‌లం సినిమాల ద్వారా  ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టు స‌మాచారం.

8 /9

ఈ రేంజ్‌లో కీర్తి సురేష్ లా ఆస్తులు కూడ‌బెట్టిన హీరోయిన్ ద‌క్షిణాదిలో ఎవ‌రు లేర‌నే చెప్పాలి.

9 /9

ఇప్పటి వరకు దక్షిణాదిలో కన్నడ మినహా అన్ని ఇండస్ట్రీస్‌లో నటించిన కీర్తి సురేష్‌.. త్వరలో 'బేబి జాన్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన 'తేరి' మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది.