Lakshmi Devi: లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఈ దిశలో పెట్టుకుంటే లక్ష్మీకటాక్షంతో డబ్బే డబ్బు..

Lakshmi Devi Photo Vastu: సంపదల దేవత లక్ష్మీదేవి. ఆమె కటాక్షిస్తే ఇంట్లో సుఖః సంతోషాలు వెల్లువిరుస్తాయి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరగా బయటపడతారు. లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం.
 

1 /5

పూజగది.. సాధారణంగా ఏ దేవుని చిత్రాలైన పూజగదిలో ఏర్పాటు చేసుకుంటాం. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఈశాన్యం మూలలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ దిశలో ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ ఇంట్లో ఉన్నవారు త్వరగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు.

2 /5

హాల్‌.. పూజగదిలో కాకుంటే ఇంటి హాల్‌ లేదా డైనింగ్‌ ఏరియాలో కూడా లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కువ శాతం గడుపుతారు కాబట్టి ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవి చిత్ర పటం ఏర్పాటు చేసుకునే ప్రదేశంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ గదుల్లో కూడా ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి.

3 /5

ఆఫీస్‌.. ఒకవేళ ఆఫీసులో మీరు లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. బిజినెస్‌లో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆఫీసులో కూడా ఉత్తర దిశలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. దీంతో కెరీర్‌ పరంగా కూడా అభివృద్ధిని చూస్తారు. 

4 /5

ప్రధానద్వారం.. కొంతమంది ఇంటి ప్రధానద్వారం వద్ద లక్షీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఎప్పుడు ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీంతో లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది. అయితే, లక్ష్మీదేవి చిత్ర పటాన్ని ఇంటి ప్రధాన ద్వారం లోపలి వైపు ఏర్పాటు చేసుకోవాలి. అంటే లక్ష్మి ఇంట్లోకి వస్తున్నట్లు పెట్టుకోవాలి.

5 /5

బెడ్రూమ్‌.. బెడ్రూమ్‌లో ఎక్కువశాతం మనం రెస్ట్‌ తీసుకుంటాం. ఈ బెడ్‌రూంలోని ఈశాన్య మూలలో చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ దిశ ధనానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి.  అయితే, వాస్తు ప్రకారం బెడ్‌పక్కనే, కాళ్ల వద్ద మాత్రం ఎట్టిపరిస్థితుల్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోకూడదు..(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)