Snake Bite: పాము కాటు వేసిందా.?.. డోంట్ వర్రీ.. విరుగుడును కనిపెట్టిన సైంటిస్టులు..

Snake Venom: పాములు చెట్లు, పొదలు, అడవులకు దగ్గరగా ఉన్న ఇళ్లలో ఎక్కువగా కన్పిస్తుంటాయి. పొలాలకు దగ్గరగా ఉన్న ఇళ్లలోకి కూడా ఇవి కన్పిస్తుంటాయి. ఇవి అనుకోకుండా మనిషికి కన్పిస్తాయి. కొందరు వీటిని పట్టుకొవాలని స్నేక్ సొసైటీలకు కాల్ చేస్తారు. ఇంకొందరు చంపేస్తుంటారు..

1 /6

కొన్నిసార్లు రైతులు పొలం పనులకు వెళ్లినప్పుడు కూడా చెట్ల మధ్యన పాములు కాటు వేస్తుంటాయి. ఇళ్లలో ఉపయోగించని సామానుల మధ్యలో కూడా ఇవి ఎలుకల కోసం వస్తాయి. అలాంటి ప్రదేశాలకు మనం వెళ్లినప్పుడు మనల్నికాటు వేస్తాయి.

2 /6

పాముఎవరినైన కాటేయగానే.. అది ఎలాంటి పాము డాక్టర్ కు చెబితే దానికి తగ్గట్టుగా యాంటీ వీనమ్ ఇస్తుంటారు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం.. కాటేసిన పామును పట్టుకుని మరీ డాక్టర్ దగ్గరకు పెషెంట్లు వెళ్తున్నారు. కొన్నిసార్లు పాముకు విరుగుడు పనిచేయకపోవచ్చు.

3 /6

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్  (ఐఐఎస్ సి) సైంటిస్టులు పాముకాటులో విడుదలయ్యే వెనమ్ ఆర్టిఫిషియల్ యాంటీబాడీని తయారు చేశారు.   

4 /6

సైంటిస్టులు తయారుచేసిన ఈ సింథటిక్ యాంటీబాడీ నాగుపాము, కట్లపాము,కింగ్ కోబ్రా, బ్లాక్ మాంబాల విషాన్ని సైతం ఎదుర్కొంటుదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని గుర్రాలు, గాడిదలలో టెస్ట్ చేసి చూస్తున్నారు.

5 /6

అతి తొందరలోనే మానవులలో కూడా టెస్ట్ చేస్తారని తెలుస్తోంది. దీంతో పాము కుడితే టెన్షన్ లేకుండా ఈ మందును తీసుకుంటే దాని కాటు నుంచి  మన ప్రాణాలు కాపాడుకొవచ్చన్నమాట. ఈక్రమంలోనే సైంటిస్టులు మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్లు సమాచారం.

6 /6

పాము కాటుతో మన దేశంలో ఎక్కడో ఒక చోట రైతులు చనిపోతున్నట్లు సమాచారం. దీని వల్ల  కొందరు రైతులు పొలంలోకి వెళ్లాలంటేనే భయంతో జంకుతున్నారు. తాజాగా , బెంగళూరు సైంటిస్టుల పరిశోధనల పట్ల అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.