kanuma festival journey: చాలా మంది కనుమ రోజున ప్రయాణాలు చేయోద్దని చెప్తుంటారు. దీని వల్ల జీవితంలో లేనీ పోనీ సమస్యలు వస్తాయని కూడా ఇంట్లో వాళ్లు తరచుగా అంటుంటారు.
తెలుగు నాట సంక్రాంతిని ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమల్నిఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే.. ఈ క్రమంలో ఎక్కుడన్న కూడా.. పండగకి సొంతుళ్లకు చాలా మంది ఇప్పటికే వెళ్లిపోయారు.
ఇంట్లో వాళ్లు, బంధువులు, స్నేహితులతో కలిసి సరదాగా సంక్రాంతి పండగను ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మాయిలు అందంగా ముగ్గులు వేసి,గొబ్బెమ్మల్ని అందంగా పేర్చారు. అంతే కాకుండా.. అబ్బాయిలు పతంగీలు ఎగర వేస్తు రచ్చచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చాలా మంది సంక్రాంతి పండుగను ధూమ్ ధామ్ గా జరుపుకుంటున్నారని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో మన ఇళ్లలో చకినాలు, అనేక రకాలు స్వీట్లు, పిండివంటలు పండక్కి చేసుకుంటారు. కొన్ని చోట్ల కనుమ నాడు గ్రామం పొలిమేర దాటొద్దని ఆచారం పాటిస్తు వస్తుంటారు.
కనుమ రోజు పొలిమేరదాటితే చెడు జరుగుతుందని ఇప్పటికి చాలా మంది విశ్వసిస్తారు.పూర్వకాలంలో కనుమ రోజున ఎడ్లను అలంకరించేవారు. అప్పట్లో ప్రయాణాలకు ఎడ్లను ఉపయోగించే వారు. అందుకు వాటిని కనుమ రోజున మాత్రం అలంకరణ చేసి, రెస్ట్ ఇచ్చేవారు.దీంతో కనుమ రోజున జర్నీ చేయకుండా.. ఇలా నియమం పెట్టుకున్నారంట. అలా ఈ నియమం కాలక్రమంలో కనుమ రోజు జర్నీ చేయోద్దని మారిపోయిందని కొందరు చెప్తుంటారు.
ఇంకొందరు కనుమ రోజున చనిపోయిన పూర్వీకులు భూమి మీదకు వస్తారని.. వారికి ఇష్టమైన పదార్థాలు, మద్యం చాలా మంది నైవేద్యంగా పెడతారు. అలా పెట్టిన వాటిని మరల ప్రసాదంగా తింటారు. ఈ పిండిపదార్థాలు, మద్యం వల్ల ప్రయాణంలో ఏదైన జరగొచ్చని ఇలా నియం పెట్టారని కూడా కథనం ప్రచారంలో ఉంది.
ఏదీ ఏమైన కనుమ రోజు కాకి కూడా చెట్టుమీద నుంచి కదలదని చాలా మంది నమ్ముంటారు. ఒక వేళ తప్పనిసరిగా వేరే గ్రామానికి లేదా.. పనిమీదకు వెళ్లేవారు.. ఇంటి నుంచి బైటకు వెళ్లేటప్పుడు దేవుడి విగ్రహం ముందు దీపం వెలిగించి.. బెల్లం ముక్కనోట్లో వేసుకుని వెళ్తే.. ఎలాంటి దోషం చుట్టుకొదని పండితులు సూచిస్తున్నారు. ( ఇది సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా రాయడం జరిగింది.. జీ మీడియా దీన్ని ధృవీకరించలేదు..)