Jwala Gutta Wedding Photos: ఘనంగా గుత్తా జ్వాల, హీరో విష్ణు విశాల్ వివాహం

 కరోనా సమయంలో పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు. తాజాగా ఆ జాబితాలో భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ ప్రేమ వివాహం చేసుకున్నారు.

Jwala Gutta Wedding Pics:  కరోనా సమయంలో పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు. తాజాగా ఆ జాబితాలో భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ ప్రేమ వివాహం చేసుకున్నారు.

1 /7

Jwala Gutta Marriage Photos:  కరోనా సమయంలో పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు. తాజాగా ఆ జాబితాలో భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహానికి మొయినాబాద్ వేదికగా మారింది. (Image Credit: Twitter)

2 /7

Vishnu Vishal Wedding Photos: భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మొయినాబాద్‌ వేదికగా గురువారం(ఏప్రిల్‌ 22) మధ్యాహ్నం వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి మిత్రులు, సన్నిహితులు గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. (Image Credit: Twitter)

3 /7

ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా తమ పెళ్లి పత్రికను బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట కరోనా వ్యాప్తి సమయంలో కుటుంబసభ్యులు, కొంత మంది ప్రముఖు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. (Image Credit: Twitter)

4 /7

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కెపల్లి సమీపంలోని ఓ విల్లాలో ప్రేమ జంట విష్ణు విశాల్, గుత్తా జ్వాల వివాహబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. (Image Credit: Twitter)

5 /7

వీరిద్దరికి ఇది రెండో వివాహం కావడం గమనార్హం. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్, గుత్తా జ్వాల 2005లో వివాహం చేసుకున్నారు. 2011లో వీరు విడాకులు తీసుకున్నారు. (Image Credit: Twitter)

6 /7

తమిళ నటుడు విష్ణు విశాల్, రజనీ నటరాజన్‌ల వివాహం 2010లో ఘనంగా జరిగింది. అయితే విభేదాలు తలెత్తడంతో 2018లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. గత రెండేళ్లుగా విష్ణు విశాల్, గుత్తా జ్వాల డేటింగ్ చేశారు. వీరి పరిచయం ప్రేమగా మారి, పెళ్లిపీటల వరకు వచ్చింది. (Image Credit: Twitter)

7 /7

బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ సెలబ్రిటీలు కావడంతో వీరి పెళ్లి ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Credit: Twitter)