Jio 5G Plans: జియో బంపర్ ఆఫర్లు ఇస్తూనే ఉంది. కస్టమర్లను తమవైపు మళ్లీంచేందుకు సరికొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 49 కోట్ల యూజర్లు కలిగి ఉన్న జియో మరిన్ని ఆఫర్లను ఇస్తుంది. ఈరోజు రూ.200 లోపు ఉన్న మూడు 5 జీ డేటా ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం.
జూలై నెలలో టెలికాం ధరలు భారీ ఎత్తున పెరగడంతో చాలామంది యూజర్లను కోల్పోయింది జియో. అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తూ మరోసారి స్ట్రాంగ్ నెట్‌వర్క్ ఉన్న దిగ్గజ కంపెనీగా నిరూపించుకుంది.
జియో రూ.189 ప్లాన్.. ఈ ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, 2 జీబీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందుతారు. అంతేకాదు ఈ రీఛార్జీ ప్లాన్‌లో మీరు అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ 28 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.
జియో రూ.198 ప్లాన్.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు ఉంటుంది. ఇందులో మీరు ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. అంటే పూర్తిగా 28 జీబీ డేటా. అదనం 5జీ బోనస్, అపరిమిత 5 జీ డేటా పొందుతారు. 5 జీ కవరేజీ ఉన్న ఏరియాల్లో ఉన్న కస్టమర్లకు ఇది బెస్ట్.
జియో రూ.199 ప్లాన్.. జియో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు వర్తిస్తుంది. ఇందులో 1.5 జీబీ డైలీ డేటా, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు. అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కూడా అందుకుంటారు.
పెరిగిన టెలికాం ధరల తర్వాత చాలా మంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రైవేటు దిగ్గజ జియో ఇలా కొత్త బంపర్ రీఛార్జీ ఆఫర్లను ప్రకటిస్తుంది.