IPL Most Runs Player: ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌ ఫైవ్‌ ప్లేయర్లు వీరే

IPL Most Runs Player: విరాట్‌ కోహ్లీ, ధావన్‌, రోహిత్‌ శర్మ, వార్నర్‌, రైనా... వీరంతా ఐపీఎల్‌ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ప్రతి సీజన్‌ లోనూ నిలకడగా ఆడుతూ.. జట్టు విజయం సాధించడంలో వీరు కీలకపాత్ర పోషించారు. మరీ వీరు ఐపీఎల్‌ లో సాధించిన రికార్డుల గురించి మనం స్పెషల్‌ స్టోరీలో చూద్దాం.

  • Apr 20, 2022, 16:18 PM IST

IPL Most Runs Player: ఐపీఎల్‌- క్రికెట్‌ ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించే జెంటిల్‌ మెన్‌ గేమ్‌. ప్రపంచంలోనే ఐపీఎల్‌ లీగ్‌ కు ప్రత్యేక గుర్తింపు, ఆదరణ ఉంది.  ఐపీఎల్‌ లో ఆడేందుకు ఎంతో మంది క్రికెటర్లు పోటీపడుతుంటారు. వేలం కోసం తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారు. వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు.. తమ పంట పండినట్టే అనుకుంటారు. ఎందుకంటే ఒక్క సీజన్‌ లో పర్ఫామెన్స్‌ చూపిస్తే.. చాలు ఆ తర్వాత జరిగే ఆక్షన్‌ లలో బెస్ట్‌ ప్రైజ్‌ దక్కడం ఖాయం. అందుకే ఐపీఎల్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న  క్రికెట్‌ ఆటగాళ్లకు వెరీ వెరీ స్పెషల్‌. 2008లో ఐపీఎల్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం 15వ ఎడిషన్‌ జరగుతోంది. ఇక పదిహేను ఎడిషన్లలో నిలకడగా ఆడుతూ ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఐదుగురు ఆటగాళ్లలో .. నలుగురు కూడా ఇండియన్సే. 

1 /5

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ కెప్టెన్‌.. విరాట్‌ కోహ్లీ ఈ జాబితాలో ఫస్ట్‌ ప్లేస్‌ లో నిలిచాడు. విరాట్‌ కోహ్లీ ఇప్పటివరకు 214 మ్యాచ్‌ లు ఆడగా.. ఐదు సెంచరీలు, 42 హాఫ్‌ సెంచరీలతో.. 6402 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ ప్రారంభమైన 2008 సీజన్‌ నుంచి కూడా విరాట్‌ కోహ్లీ ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

2 /5

శిఖర్‌ దావన్‌.. తొలినాళ్లలో ముంబై  ఇండియన్స్‌ కు ఆడిన ఈ లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యాట్స్‌ మెన్‌.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ధావన్‌ ఐపీఎల్‌ లో ఇప్పటివరకు 45 హాఫ్‌ సెంచరీలు, రెండు సెంచరీలు బాది.. 5989 పరుగులు చేశాడు. ధావన్‌ ప్రస్తుత సీజన్‌ లో పంజాబ్‌ కింగ్స్‌ కు ఆడుతున్నాడు. 2009, 2010 సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు, 2011,2012 సంవత్సరంలో డెక్కన్‌ ఛార్జర్స్‌,  ఆ తర్వాత 2013 నుంచి 2018 వరకు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, 2019 నుంచి 2021 వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కు ప్రాతినిధ్యం వహించాడు.

3 /5

ఇక ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ స్కిప్పర్‌ రోహిత్‌ శర్మ.. టాప్‌ రన్స్‌ స్కోరర్‌  లిస్ట్‌ లో థర్డ్‌ ప్లేస్‌ లో నిలిచాడు. రోహిత్‌ శర్మ ఒక శతకం, 40 అర్ధశతకాలతో 5 వేల 725 పరుగులు చేశాడు.  రోహిత్‌ ముంబైకి ఆడకముందే.. 2008 నుంచి 2010 వరకు డెక్కన్‌ ఛార్జర్స్‌ కు ఆడాడు. 2011లో ముంబై ఇండియన్స్‌ లో జాయిన్‌ అయ్యాడు. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై.. ఇప్పటివరకు ఐదుసార్లు కప్‌ గెలిచింది.

4 /5

ఇక ఐపీఎల్‌ లో మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ ఓవర్‌సీస్‌ ప్లేయర్‌ ఎవరంటే టక్కున గుర్తుకువచ్చే పేరు.. ఆస్ట్రేలియన్‌ లెఫ్ట్‌ హ్యాండర్‌  డేవిడ్‌ వార్నర్‌. వార్నర్‌ నాలుగు సెంచరీలు, 51 హాఫ్‌ సెంచరీలతో ఇప్పటికే 5వేల 500 పరుగులు సాధించాడు. 2014 నుంచి కూడా వార్నర్‌.. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కే ఆడాడు. ఈ సీజన్‌ లో వార్నర్‌ ను ఢిల్లీ క్యాపిటల్స్‌ కోనుగోలు చేసింది.

5 /5

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ ఆటగాడు సురేష్‌ రైనా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. రైనా ఇప్పటివరకు ఐపీఎల్‌ లో 5528 పరుగులు చేశాడు. గతంలో రైనా.. గుజరాత్‌ లయన్స్‌ కు కెప్టెన్‌ గా.. చెన్నై జట్టుకు వైస్‌ కెప్టెన్‌ గానూ పనిచేశాడు. రైనా కేరీర్‌ లో అరుదైన ఘనత కూడా ఉంది. అన్ని ఫార్మాట్‌ లో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత ఆటగాడిగా రైనాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐపీఎల్‌ రైనా 39 హాఫ్‌ సెంచరీలు, ఒక శతకం నమోదు చేశాడు. ఇక తర్వాత స్థానాల్లో క్రిస్‌ గేల్‌, రాబిన్‌ ఊతప్ప, ఎంఎస్‌ ధోనీ, డివిలియర్స్‌, దినేశ్‌ కార్తీక్‌ వరుసగా ఉన్నారు.