ఐపీఎల్ 2022 రసవత్తరం..ఆసక్తికరం అయ్యేది కేవలం క్రికెట్ వల్లనే కాదు..అందమైన సుందరీమణులైన యాంకర్స్ వల్ల కూడా. విరామం సమయంలో క్రికెట్ అభిమానులు సహజంగానే తమకిష్టమైన మహిళా యాంకర్స్‌ను చూసేందుకు..వినేందుకు ఇష్టపడుతుంటారు. ఐపీఎల్ 2022లో మిమ్మల్ని మనోరంజితం చేసేందుకు సిద్ఘంగా ఉన్న అందమైన యాంకర్ల గురించి తెలుసుకుందాం..
IPL Female Anchors: ఐపీఎల్ 2022 రసవత్తరం..ఆసక్తికరం అయ్యేది కేవలం క్రికెట్ వల్లనే కాదు..అందమైన సుందరీమణులైన యాంకర్స్ వల్ల కూడా. విరామం సమయంలో క్రికెట్ అభిమానులు సహజంగానే తమకిష్టమైన మహిళా యాంకర్స్‌ను చూసేందుకు..వినేందుకు ఇష్టపడుతుంటారు. ఐపీఎల్ 2022లో మిమ్మల్ని మనోరంజితం చేసేందుకు సిద్ఘంగా ఉన్న అందమైన యాంకర్ల గురించి తెలుసుకుందాం..
Tanya Purohit తాన్యా పురోహిత్ ఉత్తరాఖండ్‌కు చెందినది. ఈమె గడ్వాల్ యూనివర్సిటీలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్ చేసింది. అనుష్క శర్మతో ఎన్‌హెచ్ 10 లో కన్పించింది. న్యూస్ యాంకర్ దీపక్ డోభాల్‌ను వివాహమాడింది.
Sanjana Ganesan సంజనా గణేశన్ 1991 మే 6న పూణేలో జన్మించింది. సింబయాసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ హోస్ట్ చేసింది. టీమ్ ఇండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బూమ్రాను పెళ్లి చేసుకుంది.
Neroli Meadows నేరోలీ మీడోజ్ ఓ ఆస్ట్రేలియన్ టీవీ ప్రజెంటర్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ కామెంటేటర్ కూడా. క్రికెట్‌తో పాటు బాస్కెట్ బాల్, ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్ కూడా హోస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ సందర్భంగా సునీల్ గవాస్కర్, కేవిన్ పీటర్సన్‌తో కలిసి షో హోస్ట్ చేస్తోంది.
Nashpreet Singh నర్‌ప్రీత్ సింగ్ 1998లో ఫిజీలో జన్మించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో విద్యాభ్యాసం చేసింది. నష్‌ప్రీత్ కౌర్ పేరుతో ప్రాచుర్యం పొందింది. ఇంగ్లీష్‌తో పాటు పంజాబీ అనర్గళంగా మాట్లాడుతుంది.
Mayanti Langer మయంతి లాంగర్ క్రికెట్ ప్రపంచంలో అందరికీ సుపరిచితం. ఈసారి కూడా ఐపీఎల్ 2022లో షో హోస్ట్ చేయనుంది. ఐపీఎల్ 2021లో కూడా అందర్నీ ఆలరించింది.