Most Wickets in IPL History: ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ల ఆధిపత్యం చెలాయిస్తున్నా.. బౌలర్లు కూడా తమ జోరు తగ్గించడంలేదు. వైవిధ్యమైన బౌలింగ్‌తో వికెట్లు తీస్తూ.. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో 183 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. అయితే కొందరు ఆటగాళ్లు బ్రావో రికార్డును బ్రేక్ చేసేందుకు చేరువగా ఉన్నారు. వాళ్లు ఎవరంటే..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్‌లో మళ్లీ జోరు కనపరుస్తున్నాడు. తొలి ఓవర్‌లోనే వికెట్లు తీస్తూ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు. ఇప్పటివరకు 155 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన భూవీ.. 162 వికెట్లు పడగొట్టాడు.
రాజస్థాన్ రాయల్స్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు 193 మ్యాచుల్లో 170 వికెట్లు తీశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన 5వ బౌలర్‌గా అశ్విన్ త్వరలో లసిత్ మలింగను అధిగమించే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం 140 మ్యాచ్‌ల్లో 178 వికెట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉన్నాడు. చాహల్ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే.. ఈ సీజన్‌లోనే బ్రావో రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ముంబై ఇండియన్స్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఈ సీజన్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు. ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో 174 మ్యాచ్‌లలో 172 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చావ్లా ఉన్నాడు.
లక్నో సూపర్ జెయింట్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 160 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 172 వికెట్లు పడగొట్టాడు. డ్వేన్ బ్రావో కంటే 11 వికెట్లు తక్కువగా ఉన్నాడు.