IPL 2024: తీవ్ర గాయాల అనంతరం ఐపీఎల్ 2024కు సిద్ధమైన టాప్ 5 క్రికెటర్లు

ఐపీఎల్ 2024 సీజన్ 17 మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్‌లోనే టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్లు ఎదురెదురుకానున్నారు. ఇటీవల గాయాలపాలైన కొందరు క్రికెటర్లు ఐపీఎల్ 2024లో తిరిగి వస్తున్నారు. 

IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ 17 మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్‌లోనే టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్లు ఎదురెదురుకానున్నారు. ఇటీవల గాయాలపాలైన కొందరు క్రికెటర్లు ఐపీఎల్ 2024లో తిరిగి వస్తున్నారు. 

1 /5

కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ కేన్ విలియమ్సన్ గత ఏడాది ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఆ తరువాత దీర్ఘకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయి గుజరాత్ టైటాన్స్ కోసం ఆడేందుకు సిద్ధమయ్యాడు.

2 /5

శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఈసారి ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇతను కూడా వెన్నుముక గాయం కారణంగా గత సీజన్ ఆడలేదు. ఆసియా కప్‌తో తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. బీసీసీఐ ఇటీవలే కాంట్రాక్ట్ జాబితా నుంచి కూడా తొలగించింది. 

3 /5

రిషభ్ పంత్ 2022 డిసెంబర్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తృటిలో ప్రాణాలతో బయటపడ్డ టీమ్ ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ సుదీర్ఘ విరామం తరువాత మరోసారి గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఏడాదికాలంగా ఆటకు దూరమయ్యాడు. 

4 /5

కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గత ఏడాది ఐపీఎల్ సమయంలో గాయపడ్డాడు. చాలాకాలం ఆటకు దూరంగా ఉన్న రాహుల్..ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో తిరిగి గాయపడ్డాడు. ఇప్పుడు పూర్తిగా ఫిట్‌నెస్ సంపాదించుకుని లక్నో సూపర్ జెయింట్స్ సారద్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

5 /5

జస్ప్రీత్ బూమ్రా టీమ్ ఇండియాకు, ముంబై ఇండియన్స్ జట్టుకు ముఖ్యమైన పేసర్ జస్ప్రీత్ బూమ్రా. గత ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. వెన్నుముక గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఈ మధ్యనే ఐర్లాండ్ సిరీస్‌తో తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు.