India vs West Indies 1st T20I Records: తొలి టీ20 మ్యాచ్‌లో ఆటగాళ్ల రికార్డులు ఇవే.. తొలి ప్లేయర్‌గా తిలక్ వర్మ..!

TOP Stats And Numbers From 1st T20 IND Vs WI: టీమిండియాతో టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయిన విండీస్.. పొట్టి ఫార్మాట్‌ సిరీస్ మాత్రం ఘనంగా ఆరంభించింది. తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియాను నాలుగు పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరే చేసినా.. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లు పలు రికార్డులు బద్దలు అయ్యాయి. వాటిపై ఓ లుక్కేయండి..
 

1 /5

ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన తిలక్ వర్మ.. 177.27 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. 22 బంతుల్లో 39 రన్స్ చేశాడు. టీ20 అరంగేట్రంలో (కనీసం 30 పరుగులు) భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్ట్రైక్ రేట్ ఇది.    

2 /5

టీ20ల్లో టీమిండింయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా విదేశాల్లో 45 వికెట్లు తీశాడు. యుజ్వేంద్ర చాహల్ (44 వికెట్లు)ను అధిగమించాడు. భువనేశ్వర్ కుమార్ (56), రవిచంద్రన్ అశ్విన్ (50) మాత్రమే అతని కంటే ముందున్నారు.    

3 /5

వెస్టిండీస్ 26 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌పై 8వ విజయాన్ని నమోదు చేసింది. భారత్ 17 టీ20 మ్యాచ్‌లు గెలిచింది.    

4 /5

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ (55 వికెట్లు) శామ్యూల్ బద్రీ 54 వికెట్ల సంఖ్యను అధిగమించాడు. టీ20ల్లో వెస్టిండీస్ తరపున డ్వేన్ బ్రావో (78) తర్వాత రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.   

5 /5

తిలక్ వర్మ  తన తొలి మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదాడు. విదేశాల్లో అరంగేట్రం మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్, మురళీ విజయ్‌లతో కలిసి అత్యధికంగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.