Summer Season:కొన్నిరోజులుగా ఇరు తెలుగురాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. అటు ఎన్నికల వేడి ఒకవైపు,భానుడి ప్రతాపం మరోవైపుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి క్రమంలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది.
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఇరు తెలుగురాష్ట్రాల ప్రజలు ఎండవేడికి ఇప్పుడు అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు ఏప్రిల్, మేనెలలో ఉండే ఎండలు ఇప్పుడు మండిపోతుండటంలో జనాలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇక జాబ్ లు, బిజినెస్ ల కోసం వెళ్తున్న వారు తప్పనిసరిగా ఎండ నుంచి ఉపశమనం కోసం టోపీలు, గొడుగులు ఉపయోగిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో మాత్రం జనాలు రోడ్లమీద రావడానికి వణికిపోతున్నారు.
కొందరు మాత్రం ఎండల నుంచి ఉపశమనం కోసం జ్యూస్ లు, శీతలపానీయాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో చిన్నపాటి వ్యాపారులు.. కుండలు అమ్మేవాల్లు, కూలర్ లు, ఏసీలకు, జ్యూస్ వ్యాపారులకు డిమాండ్ పెరిగింది..
ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా ఎండతో ఉక్కిరిబిక్కిరి అయిన జనాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. బంగాళ ఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావం ఏర్పడిందని దీని ప్రభావంతో రాగల కొన్ని గంటలలో తెలుగు రాష్ట్రాలలో ఒక మోస్తరు వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది.
ఇప్పటికే తెలంగాణలోని అనేక జిల్లాలో వడగండ్ల వాన కురిసింది. కొన్ని చోట్ల 3 నుంచి 5 సెంటీ మీటర్ల వరకు కూడా వర్షం కురిసినట్లు సమాచారం. వడగండ్ల వాన వల్ల ఎండలో ఆరేసిన.. వడ్లు పూర్తిగా తడిసి ముద్దలా మారిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలోని గుంటూరు, బాపట్ల, ప్రకాశంలోపాటు పలుజిల్లాలలో ఒక మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోని ఉత్తర కోస్త జిల్లాలలో కూడా వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. రాబోయే మరికొన్ని గంటలలో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీగా వర్షం కురుస్తుందని ఐఎండీ ఒక వెల్లడించింది.