IBPS Job Calendar Released 2025: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ఎగ్జామ్ పరీక్ష క్యాలెండర్ విడుదల చేసింది. 2025 కు సంబంధించి క్యాలెండర్ విడుదల నేడు విడుదల చేసింది. బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఈ క్యాలెండర్‌ను క్షుణ్నంగా చదివిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఆఫీసర్ స్కేల్ 1 జూలై 27 తేదీన నిర్వహించనున్నారు. ఇంకా ఐబీపీఎస్ PSB రిక్రూట్మెంట్ కూడా ఏడాదిలో నిర్వహించనున్నారు ప్రొబేషనరీ, మేనేజ్మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బ్యాంకు జాబ్ సాధించాలని అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఐబీపీఎస్. ఈ ఏడాదికి సంబంధించిన ఎగ్జామ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇందులో ఐబీపీఎస్ పీవో, క్లెరికల్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ తేదీలు ఫలితాల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. అధికారిక వెబ్సైట్ IBPS.In పూర్తి వివరాలు ఉన్నాయి.
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2025.. ఐబీపీఎస్ ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1, 2, 3 ఎగ్జామ్ పోస్టుల తేదీలను కూడా విడుదల చేశారు. జూలై 27న ఈ పరీక్ష నిర్వహించనున్నారు ఇక స్కేల్ టు స్కేల్ త్రి కి ఆగస్టు 2న నిర్వహిస్తారు ఆఫీస్ అసిస్టెంట్‌కు ఆగస్టు 3న ఈ ముగ్గురికి మెయిన్స్ ఎగ్జామ్ కూడా సెప్టెంబర్ 13 తేదీల్లో నిర్వహిస్తారు ఇక ఆఫీస్ అసిస్టెంట్ కు నవంబర్ 9న నిర్వహించనున్నారు.
ఐబీపీఎస్ పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ తేదీలు ఇక ప్రొఫెషనరీ ఆఫీసర్ కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అక్టోబర్ 4, నవంబర్ 22 డిసెంబర్ 7 నిర్వహిస్తారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ అక్టోబర్ 5 సిఎస్సి అక్టోబర్ 11. ప్రొఫెషనరీ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్ 29 నిర్వహించారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ జనవరి 4, 2026 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఫిబ్రవరి 1, 2026న నిర్వహించనున్నారు.
ఐబీపీఎస్ పరీక్షలకు అప్లై చేసుకునే విధానం అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దిష్ట ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ సైజు థంబ్ ఇంప్రెషన్ వంటివి జేపీఈజీ ఫార్మేట్ లో ఉండేలా చూసుకోవాలి.
అంతేకాదు వీటి అన్నిటిని స్కాన్ చేసి అక్కడ సూచించిన ఫార్మాట్లో డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత పరీక్ష తేదీకి ముందుగానే హాల్ టిక్కెట్లు విడుదల చేస్తారు. వాటిని ప్రింట్ తీసి ఫోటో పేస్ట్ చేయాలి. మీతోపాటు పరీక్షలకు ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది.