Money Saving Tips: ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చులకు తగినట్లు చాలా మంది సేవింగ్స్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మనం ఎంత సంపాదించినా.. చేతిలో రూపాయి కూడా మిగలట్లేదని బాధపడుతుంటారు. వచ్చిన జీతం అంతా.. ఈఐంఎలు, రెంట్స్, కిరాణా ఖర్చులకే సరిపోతుందని ఆలోచిస్తుంటారు. జీతం ఇలా వచ్చి అలా అయిపోగానే.. మళ్లీ ఒకటో తారీఖు ఎప్పడు వస్తుందని ఎదురుచూస్తుంటారు. అయితే ఖర్చులను కాస్త అదుపులో పెట్టుకుని.. సరైన బడ్జెట్ ప్లాన్ తయారు చేసుకుంటే భవిష్యత్ అవసరాల కోసం ఎలాంటి ఇబ్బంది ఉండదు.
50:30:20 నియమం బడ్జెట్ ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందా. సరైన ప్రణాళికతో మీరు ఖర్చు పెట్టుకుంటే ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా జీవితం హ్యాపీగా గడిపేయవచ్చు.
మీకు వస్తున్న ఆదాయాన్ని మీరు మూడు వర్గాలుగా చేసుకోండి. మీ అవసరాలు, కోరికలు, పొదుపు వర్గాలుగా డివైడ్ చేసుకోండి.
హౌస్ రెంట్, ఈఎంఐలు, కిరాణా వస్తువుల, ఇతర ఖర్చులకు కొనుగోలు కోసం 50 శాతం వినియోగించుకోండి. మీకు 50 శాతం కంటే ఎక్కువ ఉంటే.. కచ్చితంగా ఖర్చు తగ్గించుకోవాల్సిందే.
టూర్స్, ట్రిప్స్, సినిమాలు, రెస్టారెంట్స్‌లో ఫుడ్, బ్రాండెడ్ వస్తువులు లేదా గాడ్జెట్లను కొనుగోలులో జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. మీ ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి.
మిగిలిన 20 శాతం మాత్రం సేవింగ్స్ కోసం పక్కనపెట్టాల్సిందే. ఏదైనా SIP లో ఇన్వెస్ట్ చేయడం లేదా ఎమర్జెన్సీ ఫండ్‌గా సపరేట్ బ్యాంక్ అకౌంట్లో సేవ్ చేసుకోవడం వంటివి చేయాలి.
ఉదాహరణకు మీ జీతం రూ.30 వేలు అని అనుకుందాం.. 50:30:20 పెట్టుబడి సూత్రాన్ని అమలు చేస్తే.. ==> జీవన వ్యయాలకు 50 శాతం అంటే రూ.15,000 ఉపయోగించాలి. ==> మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న వస్తువులకు 30 శాతం అంటే రూ.9 వేలు కేటాయించండి. ==> SIP పెట్టుబడులకు 20 శాతం అంటే రూ.6 వేలు ఇన్వెస్ట్ చేయాలి.
రెస్టారెంట్లకు వెళ్లడం తగ్గించడం.. అనవసరంగా ఆన్లైన్లో షాపింగ్ చేయడం.. ఇష్టానుసారం క్రెడిట్ కార్డులను వినియోగిస్తే మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.