How to get MUDRA loans: రూ. 10 లక్షలు వరకు రుణం ఇచ్చే MUDRA loans కి ఎవరు అర్హులు, ఎవరు ఇస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

కరోనావైరస్ సంక్షోభం, లాక్‌డౌన్, దాని పర్యవసానాలు సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఓవైపు వ్యాపారం లేక, మరోవైపు నష్టపోయిన వ్యాపారాన్ని తిరిగి వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు నిధులు లేక పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిరు వ్యాపారుల సమస్యల గురించి ఇక చెప్పనక్కరే లేదు.

  • Jan 30, 2021, 19:33 PM IST

లాక్‌డౌన్ సమయంలో దెబ్బతిన్న వ్యాపారాలను చక్కబెట్టుకోవడానికి, నిధులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి, కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా ఉపాధి మార్గాన్ని వెతుక్కోవాలని భావించే వారికి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముద్ర లోన్ చక్కటి పరిష్కారంగా నిలవనుంది. ముద్ర లోన్ ద్వారా మీరు మీ వ్యాపారం కోసం రూ .10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు.

1 /8

ముద్ర లోన్ అంటే ఏమిటి ( What is Mudra Loan ? ) ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం ( PMMY )తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పీఎం ముద్ర యోజన పథకం ద్వారా చిరు వ్యాపారులు రూ. 10 లక్షల వరకు రుణం తీసుకుని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు దానినే ఒక ఉపాధి మార్గంగాను మల్చుకోవచ్చు. వివిధ రంగాల్లో బిజినెస్ చేసుకునే వెండార్స్, వ్యాపారులు, దుకాణదారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

2 /8

Who will give Mudra loans ? ముద్ర లోన్ ఎవరు ఇస్తారు ? ప్రధాన మంత్రి ముద్రా లోన్స్ ద్వారా రుణం పొందవచ్చని చాలామందికి తెలుసు కానీ ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి పొందాలి అనే విషయాలే చాలామందికి తెలియవు. అటువంటి వారి సందేహాలకు సమాధానమే ఈ వార్తా కథనం. ముద్ర లిమిటెడ్‌లో పేరు నమోదైన కమెర్షియల్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఈ ముద్ర లోన్ మంజూరు చేస్తాయి.

3 /8

ముద్ర లోన్స్ మూడు రకాలు ( Mudra Loan types ): పీఎం ముద్ర యోజన పథకం కింద బ్యాంకులు మంజూరు చేసే ముద్ర రుణాలు మూడు రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది శిశు లోన్ ( రూ 50, 000 వరకు రుణం ) కాగా రెండోది కిషోర్ లోన్ ( రూ. 50,002 నుంచి రూ.5 లక్షల వరకు ) అని పిలుస్తారు. ఇక మూడవ రకం లోన్ విషయానికొస్తే.. తరుణ్ లోన్‌ స్కీమ్‌గా పిలిచే ఈ ముద్ర రుణం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు.

4 /8

ఏయే వయసుల వారు అర్హులు ( Mudra Loan Eligibility ): 18 ఏళ్ల వయస్సు నుంచి 65 ఏళ్ల వయస్సు వరకు ఎవరైనా ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా వ్యాపారం చేసుకోవాలనుకునే వారికైనా, ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారికైనా ముద్ర లోన్స్‌కి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే.

5 /8

ఎలా దరఖాస్తు చేసుకోవాలి ( MUDRA loan application process ): పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకులను నేరుగా ఆశ్రయించి అక్కడైనా ముద్ర లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్ ద్వారా కూడా ముద్ర లోన్‌కు దరఖాస్తు చేయవచ్చు.

6 /8

సెక్యురిటీ అవసరమా ( Security for Mudra loan ): ముద్ర లోన్ కింద రుణం పొందడానికి ఎటువంటి సెక్యురిటీ అవసరం లేదు. థర్డ్ పార్టీ నుంచి సెక్యురిటీ లాంటివి ఏవీ అవసరం లేకుండానే ముద్ర లోన్ పొందవచ్చు.

7 /8

ముద్ర లోన్‌కి అవసరమైన డాక్యుమెంట్స్ ( Documents required for MUDRA loan ): ముద్ర లోన్‌కి దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్స్ విషయానికొస్తే.. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్, ఓటర్ ఐడి, ప్యాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడి కార్డులు ఉపయోగించుకోవచ్చు. అలాగే అడ్రస్ ప్రూఫ్.. ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, గ్యాస్ బిల్, వాటర్ బిల్ వంటివి సమర్పించవచ్చు. ఏ బిజినెస్ కోసమైతే రుణం తీసుకోవాలని భావిస్తున్నారో.. అందుకు సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఆధారంగా చూపించాల్సి ఉంటుంది.

8 /8

కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా ? లేదా ఉన్న వ్యాపారాన్నే మరింత అభివృద్ధి చేసేందుకు లోన్ కోసం ( Loans for Business or Business expansion ) చూస్తున్నారా ? ఐతే మరి ఇంకేందుకు ఆలస్యం ? మీ దగ్గర్లోని బ్యాంకును సంప్రదించి ముద్ర లోన్స్ కోసం దరఖాస్తు తీయండి ( Apply for Mudra loans ).  Also read : Cheap and best mobiles: రూ. 10 వేల కంటే తక్కువ ధరలో లభించే Best Smartphones, వాటి Features Also read : Axis Bank Credit card: ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే క్రెడిట్ కార్డు Also read : Eating more salt: ఉప్పు ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా ?