Honor 200 Launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ కంపెనీ స్మార్ట్ఫోన్లకు ప్రత్యేక క్రేజ్ ఉంది. భారతీయ మార్కెట్లో కూడా ఆశించిన స్థాయిలోనే వాటా ఉంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ లాంచ్ చేసింది. Honor 200, Honor 200 Pro పేర్లతో లాంచ్ అయిన ఈ ఫోన్ అందుబాటు ధరలో ఉండటం విశేషం
Honor 200, Honor 200 Pro ఫోన్లు రెండూ 100 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. ఈ రెండూ 5200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటాయి. అంతకుమించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ రెండు ఫోన్లు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా కలిగి ఉంటాయి
Honor 200, Honor 200 Pro ఫోన్లు రెండూ 100 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. ఈ రెండూ 5200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటాయి. అంతకుమించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ రెండు ఫోన్లు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా కలిగి ఉంటాయి.
Honor 200 Pro, Honor 200 రెండు ఫోన్లు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఎమోల్డ్ ఎల్ఈడీ డిస్ప్లేతో పనిచేస్తాయి. Honor 200 స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. Honor 200 Pro అయితే 8 ఎస్ జనరేషన్ 3 ఆధారంగా పనిచేస్తుంది.
Honor 200 6.78 అంగుళాల ఎమోల్డ్ ఎల్ఈడీ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. అదే Honor 200 Pro అయితే 6.78 అంగుళాల ఎమోల్డ్ ఎల్ఈడీ క్వాడ్ కర్వ్డ్ ఫ్లోటింగ్ డిస్ప్లేతో వస్తోంది.