Radish pachadi: ముల్లంగి పచ్చడిని చాలా మంది ఎంతో ఇష్టంతో తింటారు. అయితే.. ముల్లంగిపచ్చడిని తింటే అనేక ఉపయోగాలు కల్గుతాయంట. దీని పచ్చడి ఏవిధంగా చేస్తారో ఇప్పుడు చూద్దాం.
చలికాలంలో ముల్లంగి మార్కెట్ లో ఎక్కువగా దొరుకుతుంటాయి. దీన్ని రోజు మనం వండుకునే పదార్థాలతో కలిపి తింటు ఉండాలి. ముల్లంగిని మార్కెట్ లో నుంచి తెచ్చుకుని శుభ్రంగా కడుక్కొవాలి. ఆ తర్వాత దీన్ని సన్నగా ముక్కలు చేసుకుని తురుము కొవాలి.
మరో గిన్నెలో పెరుగును రెడీగా ఉంచుకొవాలి. గ్యాస్ మీద చిన్న కడయ్ పెట్టాలి. రెండు చిన్న స్పూన్ ల నూనెను దానిలో వేయాలి. నూనె వేడి అయ్యాక.. ఆవాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఇలా వేసిన తర్వాత కాసేపు వేడి అయ్యాక. పక్కన తీసుకొని పెట్టుకొవాలి.
అప్పటికే ముల్లంగి తురుములో నీట్ గా పెరుగు వేసుకుని.. దాని మీద ఈ గిన్నెలోని నూనె మిగత ఐటమ్స్ ముల్లంగి తురుముమీద వేసి కింద నుంచి పై వరకు అంత మిక్స్ అయ్యేల కల్పుకొవాలి.దానిలో సరిపడా ఉప్పును, కొత్తిమీరను కట్ చేసుకుని వేయాలి.
ఇలా వేసిన తర్వాత మరల స్పూన్ తో.. పెరుగుపచ్చడిని చక్కగా కల్పుకొవాలి. ఇలా చేసుకుంటే.. కేవలం ఐదు నిముషాల్లోనే ముల్లంగి చట్నీని మన ఇంట్లోనే చేసుకొవచ్చు.
ముల్లంగిని తింటే ఆహారం తొందరగా అరుగుతుందంట. అంతే కాకుండా ముల్లంగి సాంబార్, ముల్లంగిని కూరగాయలు కూడా చేస్తారు. ఇవి సీజన్ వచ్చే కూరగాయలు. వీటిని తప్పనిసరి తినాలని చెప్తుంటారు.