Amrapali: భారీ వర్షాలకు బేజారైన హైద్రాబాద్.. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఆమ్రాపాలీ.. అధికారులకు కీలక ఆదేశాలు..

Heavy rains in Hyderabad: హైదరాబాద్ నగరం వర్షాలకు చిగురుటాకులా వణికిపోయిందని చెప్పుకొవచ్చు. రోడ్లన్ని జలమయమైపోయాయి. ఇళ్లలోని నీళ్లు వచ్చిచేరుతున్నాయి.

1 /6

వరుణుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఎడతెరిపిలేకుండా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు నిండుకుండలను తలపిస్తున్నాయి.  రోడ్లన్నిజలమయమైపోయాయి. 

2 /6

హైదరాబాద్ లో ప్రధాన ఏరియాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా ఇప్పటికే భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లో పాఠశాలలకు బంద్  సైతం ప్రకటించారు. 

3 /6

అత్యవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి సైతం మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ కాట హైదరబాద్ లో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.

4 /6

వరదల వల్ల ప్రభావితమైన పలు కాలనీలను ఆమ్రాపాలీ కాట పరిశీలించారు. ఖైరతాబాద్ తో పాటు పలు ఏరియాలో ఆమ్రపాలీ సుడిగాలి పర్యటన చేపట్టారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తమకు అప్ డేట్ ఇవ్వాలని కోరారు.  

5 /6

అత్యవసరమైనే ప్రజల బైటకు రావాలని కోరారు. అంతేకాకుండా.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు సెలవులు పెట్టొద్దని కూడా ఆదేశించారు. మ్యాన్ హోల్స్ లు తెరవొద్దని,విద్యుత్ స్తంభాలు, కరెంట్ వయర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపారు.  

6 /6

వర్షాల నేపథ్యంలో.. అత్యవసరంగా సహాయంకావాల్సిన వారు.. గ్రేటర్ హైదరబాద్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేయాలని కూడా కోరారు. ముఖ్యంగా.. 04021111111 అదే విధంగా.. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 9000113667 లకు సమాచారం ఇవ్వాలని కోరారు.