Foods for healthy kidneys: కిడ్నీలు మన శరీరంలో నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. శరీరంలో నుంచి విషపదార్థాలు వీటి ద్వారానే బయటకు వెళ్తాయి. అయితే, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జీవనశైలి పాటించాలి. ముఖ్యంగా కిడ్నీలకు భారం కలిగే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మనం కిడ్నీలు పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
యాపిల్.. మనం యాపిల్ తింటూ ఉంటాం. వైద్యులు కూడా చెబుతారు ప్రతిరోజూ ఒక యాపిల్ తినమని సూచిస్తారు. యాపిల్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల్లో రాళ్ల ఏర్పడటం వంటివి కూడా జరగవు. యాపిల్లో యాక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యలు దరిచేరనివ్వవు. అంతేకాదు యాపిల్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగనివ్వకుండా కాపాడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
క్యాప్సికం.. క్యాప్సికం డైట్లో చేర్చుకోవడం మంచిది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే క్యాప్సికం తినాలి. ఇది రాళ్ల సమస్య ఏర్పడకుండా ఉంటుంది. క్యాప్సికంలో విటమిన్ బీ6, బీ9, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల కడ్నీలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కడ్నీల్లో విషపదార్థాలు తొలగించడానికి సహాయపడతుంది.
ఆకుకూరలు.. ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అయితే, ఈ పచ్చని ఆకుకూరలు తినడం వల్ల కిడ్నీల ఆరోగ్యంగ కూడా బాగుంటుంది. ఆకుకూరలు మంచి జీర్ణక్రియకు కూడా తోడ్పడతాయి.
వెల్లుల్లి.. వెల్లుల్లి లో ఉండే అల్లిసిన్ మన శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా వెల్లుల్లిని కూడా తినాలి.
క్యాబేజీ.. క్యాబేజీ క్రూసిఫెరస్ జాతికి చెందిన కూరగాయ. వీటిని తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. క్యాబేజీలో పోటాషియం, ఫైబర్, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )