Riboflavin Foods: ఈ 5 ఫుడ్స్ తింటే చాలు..శరీరానికి కావల్సినంత రిబోఫ్లెవిన్ విటమిన్ బి లభ్యం

Riboflavin Foods: రిబోఫ్లెవిన్ మనిషి శరీరానికి అవసరమైన చాలా కీలకమైన పోషకం. విటమిన్ బిగా పిలుస్తాం. శరీరంలో ఎంజైమ్స్ పనితీరు మెరుగుపర్చేందుకు ఈ విటమిన్ దోహదపడుతుంది. ఇంకా చాలా రకాల ఇతర ప్రయోజనాలున్నాయి. 
 

Riboflavin Foods: కార్బోహైడ్రేట్స్‌ను విడగొట్టడం, మొత్తం శరీరానికి పోషకాలు అందేట్టు చేయడంలో విటమిన్ బి పాత్ర కీలకమని చెప్పవచ్చు. విటమిన్ బి మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. రిబోఫ్లెవిన్ లేదా విటమిన్ బి ఏయే పదార్ధాల్లో పుష్కలంగా లభిస్తుందో తెలుసుకుందాం..

1 /5

పెసర పప్పు పెసర పప్పులో సాధారణంగా ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. దాంతోపాటు విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బీ6 కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

2 /5

పాల ఉత్పత్తులు పాలు, పెరుగు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి లేదా విటమిన్ బీ12, విటమిన్ బి3, విటమిన్ బి2, కావల్సినంతగా ఉంటుంది. అందుకే పాలను కంప్లీట్ ఫుడ్‌గా పిలుస్తారు. 

3 /5

ఫ్యాటీ ఫిష్ మాంసాహారులైతే ఫ్యాటీ ఫిష్ ఎక్కువగా తినడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ బి2 పుష్కలంగా లభిస్తుంది. దీనికోసం సాల్మన్, ట్యూనా, మ్యాక్రల్, సెర్డీన్ వంటి చేపలు ప్రయోజనకరంగా ఉంటాయి. 

4 /5

గుడ్లు ప్రోటీన్ల కోసం చాలామంది గుడ్లు తింటుంటారకు. కానీ రోజుకు 2 గుడ్లు తింటే శరీరానికి కావల్సిన విటమిన్ బి12 సంపూర్ణంగా లభిస్తుంది. 

5 /5

బ్రోకలీ ఆకు పచ్చ కూరల్లో ముఖ్యంగా బ్రోకలీలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి6 ఇలా మూడు రకాల పోషకాలు తగిన మోతాదులో లభిస్తాయి.