Boiled Foods Benefits: నిత్య జీవితంలో మనం తినే ఆహార పదార్ధాల్లో కొన్ని పచ్చిగా కూడా తినవచ్చు ఇంకొన్ని బాయిల్ చేసి తింటే ఎక్కువ లాభాలుంటాయి. మరి కొన్నింటిని వండి తింటారు. బాయిల్ చేసి తినే పదార్ధాల్లో ఎక్కువ పోషక విలువలుంటాయంటారు ఆరోగ్య నిపుణులు. అధిక ప్రయోజనాలిచ్చే 5 రకాల బాయిల్డ్ పుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
తృణ ధాన్యాలు బాయిల్ చేసిన తృణ ధాన్యాలైనా బ్రౌన్ రైస్, జొన్నలు, క్వినోవాల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను అద్భుతంగా మెరుగుపరుస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. డయాబెటిస్ ముప్పును తగ్గిస్తాయి.
బంగాళదుంప ప్రతి కూరలో సాధారణంగా బంగాళదుంప వేసి వండుతుంటారు. బాయిల్డ్ పొటాటో తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. బాయిల్డ్ ఎగ్లో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తుంది.
పాలకూర పాలకూరను కూడా బాయిల్ట్ చేసి తినడం వల్ల పోషక పదార్ధాలు మెండుగా లభిస్తాయి. ఇందులో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ కే, కాల్షియం వంటి కీలకమైన పోషకాలుంటాయి. ఇవి శరీరానికి ఎనర్జీ ఇవ్వడంతో పాటు బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తాయి. ఎముకల్ని పటిష్టం చేస్తాయి.
బాయిల్డ్ చేసిన శెనగలు, రాజ్మా, మొక్కజొన్న, బీన్స్, మటర్ వంటి వాటిలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
గుడ్లు బాయిల్డ్ ఎగ్స్ అనేవి చాలా మంచిది. మజిల్స్ పటిష్టం చేయడమే కాకుండా ఎనర్జీ అందిస్తాయి. శరీరంలో బలహీనత దూరం చేస్తాయి.