WaterMelon: పుచ్చకాయలను ఎక్కువగా తింటున్నారా..?.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

Health Benefits With WaterMelon: సమ్మర్ రాగానే అందరు పుచ్చకాయలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీనిరో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ పుచ్చకాయలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచు కోవాలి.

1 /6

పుచ్చకాయలలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. సమ్మర్ లో దీన్ని ఎక్కువగా తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. పుచ్చకాయలను ఎండ నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం దీన్ని ఎక్కువగా తింటారు. 

2 /6

పుచ్చకాయలు కొనేటప్పుడు దానిపై మచ్చలు లేకుండా ఉన్నవి కొనుగోలు చేయాలి. తొడిమే దగ్గర ముదిరిపోయింది ఉంటే లోపల పండు ఎర్రగా ఉంటుందని చెబుతుంటారు. కానీ తొడిమే పచ్చిగా, లేతగా ఉంటే మాత్రం లోపల ఎర్రగా ఉండదు..  

3 /6

వాటర్ మిలన్ లో శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్ లు అందుతాయి. కొందరు పుచ్చకాయ గింజలను కూడా తింటుంటారు. కానీ ఇవి కడుపులో  వెళితే అనేక సమస్యలు వస్తాయి. దీంతో గింజలను తీసేసి తినాలి..  

4 /6

ఎర్రగా ఉన్న వాటర్ మిలన్ ను ముక్కలుగా చేసి, షుగర్ వేసి కొందరు తింటుంటారు. ఇది వెంటనే శక్తిని ఇవ్వడంతో పాటు, నీరసాన్ని కూడా దూరం చేస్తుంది. బీపీ ఉన్నవాళ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు.   

5 /6

కొన్నిసార్లు పుచ్చకాయ లోపల భాగంలో తెల్లగా ఉంటుంది. ఇలాంటి దాన్ని అస్సలు తినకూడదు. ఇది తింటే పొత్తికడుపులో పెయిన్ వస్తుంది. కొందరిలో మోషన్స్ కల్గడానికి కూడా అవకాశం ఉంటుందని చెబుతారు.

6 /6

ప్రస్తుతం పుచ్చకాయలకు ఉన్న డిమాండ్ కారణంగా కొందరు ఆర్టిఫిషియల్ ద్రావణంలో వీటిని ముంచి తీసి పండేలా చేస్తున్నారు. వాటర్ మిలన్ లో చల్లదనం కోసం డెడ్ బాడీలు పెట్టిన ఐస్ లను కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా అప్రమత్తంగా ఉండాలి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)