Plant Keeps Rats Away: ప్రతి ఇళ్లలో ఉండే సమస్య ఎలుకలు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వీటితో నష్టం ఎక్కువ. ఇంట్లో ఉండే బియ్యం, ఆహారపదార్థాలు, దుస్తులు అన్ని ఇవి పాడు చేస్తాయి.
Plant Keeps Rats Away: ప్రతి ఇళ్లలో ఉండే సమస్య ఎలుకలు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వీటితో నష్టం ఎక్కువ. ఇంట్లో ఉండే బియ్యం, ఆహారపదార్థాలు, దుస్తులు అన్ని ఇవి పాడు చేస్తాయి. అయితే, కొన్నిసార్లు ర్యాట్ రెపల్లెంట్ వాడినా అవి బయటకు పారిపోవడానికి సమయం పడుతుంది. ఏ కెమికల్స్ వాడకుండా ఏం చక్కా కేవలం మొక్కలతో కూడా ఎలుకల బెడదను పారదోలండి. ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా ఎలుకలు కనిపించవు. ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందాం.
పుదీనా.. సాధారణంగా పుదీనాను మనం వంటల్లో ఉపయోగిస్తాం. దీని సువాసన మనకు అద్భుతంగా ఉంటుంది. అయితే, ఈ పుదీనా మొక్కలు ఎలుకలకు వికర్షకాలుగా పనిచేస్తాయి. ఈ వాసనకు అవి దూరంగా పారిపోతాయట. అందుకే మీ ఇంటి తోటలో పుదీనా మొక్కను నాటుకోండి. ఇది మీరు వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎలుకలు కూడా మీ ఇంటి దరిదాపుల్లోకి రావు. మీ వంటగదిలో ఎలుకలు ఎక్కువగా ఉంటే పుదీనా నూనెను దూదితో తడిపి ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పెట్టాలి. దీంతో అవి వెంటనే బయటకు పారిపోతాయి.
వెల్లుల్లి.. వెల్లుల్లి కూడా మన వంటగదిలో సుపరిచితమే. వెల్లుల్లిని పాములు తరమడానికి కూడా ఉపయోగపడుతుంది.ఇందులో ప్రధానంగా సల్ఫర్ ఉంటుంది. ఈ కారణంగా ఎలుకలకు ఈ వాసన ఇష్టం ఉండదు. దీంతో అవి దూరంగా పారిపోతాయి. మీ ఇంటి తోటలో వెల్లుల్లి నాటుకోండి. మీ ఇంటి చుట్టు ఎలుకల సమస్య ఉండదు.
ఉల్లిపాయ.. మన అందరి వంటగదిలో ఉల్లిపాయ సుపరిచితమే. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. నిజంగానే ఇది కొన్ని జీవాలకు వికర్షకాలుగా పనిచేస్తుంది. పొరపాటున ఎలుక దీన్ని తిన్నా దానికి గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. ఉల్లిపాయ వాసనకు అవి వెంటనే పారిపోతాయి.
లావెండర్.. లావెండర్ మొక్క సువాసనభరితంగా ఉండటమే కాకుండా ఇంటి అలంకరణ మెరుగుపరుస్తుంది. దీని సువాసనకు ఎలుకలు దూరంగా పారిపోతాయి. ఎలుకలు తిరిగే ప్రాంతంలో వీటి కాడలను పెట్టండి. ఆ వాసనకు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా ఎలుకలు రావు.