Government Scheme: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ.1,500 ఆర్థిక సహాయం..

Good News For Women: మహారాష్ట్ర ప్రభుత్వం తమ మహిళలకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ప్రతిష్టాత్మక 'మఝీ లడ్కీ బెహన్ యోజన' పథకాన్ని ప్రారంభించింది. అధికారికంగా ప్రభుత్వం ఆగస్టు  17వ తేదిన ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని కోటికిపైగా మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

1 /7

రాష్టంలోని నిరుపేద మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ  'మఝీ లడ్కీ బెహన్ యోజన' పథకాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నెరుగా ఖాతాలో జమ చేయబోతున్నట్లు తెలుస్తోంది.  

2 /7

ఈ ఆర్థిక సహాయాన్ని వెనుకబడిన కుటుంబాలకు రెండు నెలల సహాయాన్ని దాదాపు రూ.3,000లను నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు సీఎం ఏక్‌నాథ్ షిండే వెల్లడించారు. దీని లక్ష్యం మహిళల అభివృద్ధితో పాటు విద్య ప్రోత్సాహానికని ముఖ్యమంత్రి తెలిపారు.   

3 /7

ఈ  'మఝీ లడ్కీ బెహన్ యోజన' పథకాన్ని అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం కొన్ని నియమాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా అర్హులైన మహిళలు తప్పకుండా కేవలం మహారాష్ట్రకు చెందినవారై ఉండాలి.  

4 /7

అలాగే మహిళలు ఈ పథకాన్ని పొందడానికి తప్పకుండా వయస్సు 21 నుండి 65 ఏళ్ల మధ్య ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా  అవివాహితులు, విడాకులు తీసుకున్న మహిళలు కూడా దీనిన దరఖాస్తు చేసుకునే సదుపాయన్ని అందిస్తోంది.  

5 /7

ఈ పథకానికి దరఖాస్తు పెట్టుకునేవారు తప్పకుండా బ్యాంకు ఖాతాను కలిగి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారి కుటుంబ ఆదాయం దాదాపు రూ.2.5 లక్షల లోపే ఉండాల్సి ఉంటుంది. ఇవేకాకుండా మరిన్ని నియమాలు కూడా ఉన్నాయి.   

6 /7

ఈ పథకాన్ని అప్లై చేసుకునేవారు తప్పకుండా కొన్ని పత్రాలు కలిగి ఉండాలి. ఇందులోని మొదట 1.పాస్‌పోర్ట్ సైజు ఫోటో, 2. కుల ధృవీకరణ పత్రం, 3. వయస్సు సర్టిఫికేట్, 4.రేషన్ కార్డు, 5.ఓటరు గుర్తింపు కార్డు, 6.ఆధార్ కార్డ్, 7.బ్యాంక్ ఖాతా పత్రాలు తప్పకుండా ఉండాలి.  

7 /7

'మఝీ లడ్కీ బెహన్ యోజన' పథకాన్ని అప్లై చేసుకునేవారు దీనిని ఆన్‌లైన్‌తో పాటు అంగన్‌వాడీ కార్యకర్త ద్వారా కూడా  దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కూడా అందిస్తోంది. అలాగే గ్రామసేవక్, ఆశా వర్కర్ ద్వారా కూడా అప్లై చేసుకునే సదుపాయాన్ని కలిగిస్తోంది.