Salary Hike 2021-22: ఈ సంవత్సరం భారత్‌లో ఉద్యోగులకు ఎక్కువ జీతం, రెండంకెల increment, పూర్తి వివరాలు

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు. ప్రస్తుతం పరిస్థితి చాలా మారిపోయింది.

Salary Hike 2021-22: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు. ప్రస్తుతం పరిస్థితి చాలా మారిపోయింది.

1 /5

కరోనా వైరస్ కారణంగా వేతనాలు, ఉద్యోగాలలో కోత పడింది. తాజాగా అన్ని రంగాలు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించడంతో ఉద్యోగ నియమాకాలు జరుగుతున్నాయి. అదే సమయంలో పాత ఉద్యోగులకు ఆయా సంస్థలు భారీగా వేతనాలు పెంచనున్నాయని తెలుస్తోంది. Also Read: Paytm Offer: పేటీఎం బెస్ట్ ఆఫర్, కేవలం రూ.10 చెల్లించి ఈ ప్రయోజనాలు పొందండి

2 /5

డెలాయిట్ టౌచ్ తోహ్మాట్సు ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్‌లో 2021లో 7.3 శాతం వేతనాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది 20 శాతం కంపెనీలు రెండంకెల ఇంక్రిమెంట్ ఇవ్వాలని యోచిస్తున్నాయని సర్వే పేర్కొంది. Also Read: SBI Latest News: ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త, ఒక్క ఫోన్ కాల్ ద్వారా PIN జనరేట్ చేసుకోవచ్చు

3 /5

కరోనా కారణంగా గతేడాది కేవలం 12 శాతం కంపెనీలు మాత్రమే రెండంకెల ఇంక్రిమెంట్ ఇస్తాయని అంచనా వేశారు. కాగా, గతేడాది 60 శాతం కంపెనీలు మాత్రమే తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చాయి. Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి

4 /5

లైఫ్ సైన్సెస్ మరియు ఐటీ రంగాలలో ఇంక్రిమెంట్ అధికంగా ఇవ్వనున్నారని అంచనా వేసింది. దాంతోపాటుగా రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు మరియు పునరుత్పాదక ఇంధన సంస్థలు సైతం ఓ మోస్తరు ఇంక్రిమెంట్ ఇస్తాయని భావిస్తున్నారు.

5 /5

2019లో భారత్‌లో కంపెనీలు ఇచ్చిన సగటు ఇంక్రిమెంట్ 8.6%. కాగా, 2021లో ఇవ్వనున్న 7.3 శాతం కాస్త తక్కువే కానీ, ప్రస్తుత పరిస్థితులలో ఇది ఎక్కువ మొత్తంలో జీతాలు పెరగడమేనని నివేదికలు చెబుతున్నాయి. Also Read: Bajaj pulsar 180 roadster: బజాజ్ పల్సార్ కొత్త బైక్ మార్కెట్‌లో త్వరలో..ధర ఎంతో తెలుసా