Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. లక్ష రూపాయల దిశగా పసిడి పరుగెత్తుతోంది. నేడు జనవరి 18వ తేదీ శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒకే రోజు తులం ధర ఏకంగా 1500 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 82వేలకు చేరువైంది. నేటి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలో బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. మరోసారి ఆల్ టైం గరిష్టానికి చేరుకుంటున్నాయి. జనవరి 18వ తేదీ శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక రోజే పది గ్రాముల బంగారం ధర 1500రూపాయలు పెరిగింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 82వేలకు చేరువైంది.22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరరూ. 75, 100గా ఉంది. కిలో వెండి ధర రూ. 92,600ఉంది.
బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అమెరికాలో భారీగా పెరుగుతున్న బంగారం ధరలే కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో ఒకఔన్సు బంగారం ధర ర 2750 డాలర్లు పలికింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కూడా బంగారం ధరలు భారీగా పెరిగేందుకు కారణం అవుతున్నాయి.
తాజాగా ఆసియా మార్కెట్లు, అదేవిధంగా అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి దారులు తమ సంపదను భారీగా కోల్పోతున్నారు. దీనికి తోడు బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తీసుకునే ఆర్థిక విధానాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
అయితే పెట్టుబడిదారులు కూడా తమ సెంటిమెంట్ ను దెబ్బతీసే విధంగా ఉంది. దీంతో వారు తమ పెట్టుబడిని పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలిస్తున్నారు. సాధారణంగా పెట్టుబడి దారులు తమ సెంటిమెంట్ దెబ్బతిన్నప్పుడు ఇన్వెస్ట్ మెంట్ బంగారం వైపు తరలిస్తుంటారు. దీని ప్రధాన కారణం బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుంటారు.
ముఖ్యంగా కోవిడ్ వంటి సమయంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలించారు. దీనికి తోడు బంగారం ధర పెరగడానికి ముఖ్యంగా దేశీయంగా డిమాండ్ కూడా పెరగడం ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ కారణాల వల్ల కూడా బంగారం ధర భారీగా పెరుగుతుంది.