Gold Rate Today: మహిళలకు భారీ శుభవార్త. బంగారం ధర మళ్లీ తగ్గింది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత ధర తగ్గింది. నేడు దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో తులం బంగారం ఎంత పలుకుతుందో తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం పట్టుకోవడం కష్టమే అనుకున్నారంతా. పసిడి పట్టుకుంటే షాక్ కొడుతుందని టెన్షన్ పడ్డారు. కానీ ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.
ఒకస్థాయిలో 80వేలకు చేరుకున్న బంగారం ధరతో కొనుగోలు చేసేందుకు జనాలంతా భయపడిపోయారు. అయితే ఇప్పుడు ధరలు తగ్గుతుండటంతో చాలా మంది బంగారం కొనాలనే ఆశ కలుగుతోంది.
భారీ ధరలు పెరగడం వల్ల బంగారంను ఎంతో మంది ఇష్టపడే మహిళలకూడా నిరాశకు లోనయ్యారు. అయితే వాళ్లకు ఇప్పుడు శుభవార్త చెప్పాలి. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ మధ్య కాలంలో ఎనాడూ లేనివిధంగా ధరలు దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దా.
వరుసగా రెండవ రోజు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ 15వ తేదీన హైదరాబాద్ లో బంగారం ధరలు చూసినట్లయితే శనివారం రూ. 550 మేర తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర ఆదివారం నాడు మరో రూ. 900 తగ్గింది.
తులం బంగారం ధర నేడు రూ. 71,400 పలుకుతోంది. అదే 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర అయితే నిన్న రూ. 600 వరకు తగ్గింది. నేడు మరో రూ. 980 తగ్గింది. మొత్తంగా సుమారు రూ. 1600 మేర దిగివచ్చింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ. 77,890 పలుకుతోంది. వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. రెండు రోజుల్లో రూ. 4వేలు తగ్గింది. నేడు హైదరాబాద్ మార్కెట్లో కేజీ తులం ధర రూ. 1లక్ష మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారం ధరలు భవిష్యత్తులో భారీగా తగ్గే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ జనవరి చివరి వారంలో పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉంది.