Gold Rate Today: ట్రంప్ మావ వచ్చినా.. తగ్గనంటున్న బంగారం.. లక్ష దిశగా అడుగులు

Gold Rate Today: బంగారం ధరలు నిన్న స్థిరంగానే కొనసాగినప్పటికీ నేడు భారీగా పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బంగారం ధరలు తగ్గుతాయని అంతా ఊహించారు. కానీ పసిడి ధరలకు బ్రేకులు పడలేదు. నేడు జనవరి 22వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు ఏ మేరకు  పెరిగాయో తెలుసుకుందాం. 
 

1 /7

Gold Rate Today:  మనదేశంలో బంగారంకు ఎంతో ప్రజాదరణ, ప్రాముఖ్యత ఉందన్న సంగతి తెలిసిందే. చైనా తర్వాత  ప్రపంచంలో అత్యంత బంగారం వినియోగించేది భారతదేశం. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్ రేట్లు డాలర్ లో సూచించే దిగుమతి సుంకాలు, పన్నుల వంటి చాలా అంశాల ద్వారా ధరలు మారుతుంటాయి. ఇంకా బాండ్ ఈల్డ్స్, డాలర్ విలువలో మార్పులు వల్ల కూడా బంగారం ధరలు ప్రభావితం అవుతుంటాయి. అయితే 22క్యారెట్లు, 24క్యారెట్ల బంగారం ధరలు కొంతకాలంగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్న ధరలు మరోసారి పెరిగాయి. 

2 /7

ఈ రోజు బుధవారం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.82,100కి చేరుకుంది. ఈ మేరకు ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ వెల్లడించింది.

3 /7

మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.82,000 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.81,700కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల ధర రూ.81,600 వద్ద ముగిసింది. అయితే బుధవారం వెండి ధర కిలో రూ.93,000 వద్ద స్థిరంగా ఉంది. 

4 /7

గ్లోబల్ మార్కెట్లలో, కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 18.20 డాలర్లు తగ్గి 2,730.50 డాలర్లకు చేరుకుంది. కమోడిటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, నవంబర్ 6 నుండి గరిష్ట స్థాయిని తాకిన తర్వాత మంగళవారం సెషన్‌లో బంగారం ధరలు తగ్గాయి.

5 /7

  ప్రస్తుతం $2,725 వద్ద ట్రేడవుతున్నాయి. టారిఫ్ రేట్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు గ్లోబల్ ట్రేడ్ వార్  కొత్త అల గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. ఆసియా మార్కెట్‌లో సిల్వర్ కామెక్స్ ఫ్యూచర్స్ కూడా ఔన్స్‌కు 0.15 శాతం తగ్గి 31.10 డాలర్లకు చేరుకుంది.   

6 /7

మంగళవారం నాడు అమెరికా నుంచి పెద్దఎత్తున ఆర్థిక గణాంకాలేమీ లేనప్పటికీ, వ్యాపారుల దృష్టి ట్రంప్,  అతని తదుపరి విధానపరమైన చర్యలపైనే ఉంటుందని, ఇది బులియన్ మార్కెట్‌కు మరింత అస్థిరతను సృష్టించగలదని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. 

7 /7

మానవ్ మోడీ, అనలిస్ట్ (కమోడిటీస్), మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రకారం, మార్కెట్ భాగస్వాములు దావోస్‌లోని అధికారుల నుండి వచ్చే ఇన్‌పుట్‌లను కూడా గమనిస్తారు. ఇది మార్కెట్లో అస్థిరతను సృష్టించగలదు. ఇది కాకుండా, సెలవుల తర్వాత యుఎస్ మార్కెట్ తిరిగి తెరుస్తుందని.. దీని కారణంగా మార్కెట్లో అస్థిరత ఉండవచ్చు అని మోడీ అన్నారు.