Today Gold Rate: దేశంలో బంగారం,వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర నెమ్మదిగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో బంగారంతోపాటు వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold Price in Hyderabad : వరుసగా వారం రోజులపాటు భారీగా తగ్గిన బంగారం ధరలు, గడిచిన 48 గంటలుగా మాత్రం పెరుగుతున్నాయి. గురువారం తరహాలోనే నేడు శుక్రవారం కూడా బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుదల బాట పట్టాయి. గురువారం ముగింపు నుంచి శుక్రవారం ఉదయం నాటికి బంగారం ధర ఏకంగా రూ. 500 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధర 24 క్యారెట్ల కు గాను 10 గ్రాములకు రూ. 70,370 పలికింది. గురువారం ఇదే బంగారం రూ. 69,830 వద్ద ఉంది. అదే సమయంలో హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,100 వద్ద ఉంది. బుధవారం 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,950 వద్ద ఉంది. గత రెండు సెషన్లలో బంగారం ధర ఏకంగా రూ.800 పెరిగింది. దీంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
అయితే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా బంగారం ధరలు పెరగటం అంతర్జాతీయంగా గమనించవచ్చు. బంగారం ధరలు అంతర్జాతీయంగా కూడా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయిల్ - పాలస్తీనా వివాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.దీంతో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించిన తమ కేటాయింపులను బంగారం పైన మళ్లించారు ఫలితంగా పసిడి ధరలు భారీగా పెరగడం ప్రారంభించాయి.
నిజానికి బంగారం ధరలు బడ్జెట్ అనంతరం భారీగా తగ్గాయి ముఖ్యంగా బంగారంపై దిగుమతి సుంకాలను భారీగా తగ్గించడంతో, ఒక్కసారిగా దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టి ఏకంగా ఒకే రోజులో రూ. 4000 రూపాయల వరకు తగ్గింది. ఆ రేంజ్ నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తూ దాదాపు 10 గ్రాములపై రూ. 7000 వరకు తగ్గింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముఖ్యంగా అమెరికాలోని కామెక్స్ ఫ్యూచర్స్ అంచనా ప్రకారం, బంగారం ధరలపై అప్ సైడ్ మూమెంట్ చూడవచ్చు.దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం. ప్రస్తుతం కామెక్స్ సూచీలో 10 గ్రాముల బంగారం ధర 2482 డాలర్లుగా ఉంది. ఇదిలా ఉంటే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం కూడా ఉందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిజానికి స్టాక్ మార్కెట్లకు బంగారానికి అవినావ బంధం ఉంది. ఓవైపు అమెరికా,యూరప్ స్టాక్ మార్కెట్ సూచీలు పతనం అవుతున్నవేద ఇన్వెస్టర్లు బంగారం వైపు తమ చూపు తిప్పడం అనేది సహజమైన పరిణామంగానే చెప్పవచ్చు.ఈ నేపథ్యంలోనే పసిడి ధరలు అటు ఫ్యూచర్స్ మార్కెట్ తో పాటు రిటైల్ మార్కెట్లో కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది.