Glowing Skin Tips: ఈ పూవ్వు నీటితో ముఖానికి రెట్టింపు నిగారింపు.. నిత్యయవ్వనం..

Glowing Skin Tips: ముఖానికి రెట్టింపు నిగారింపు రావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఈ సందర్భంగా పార్లర్లకు కూడా వెళ్లి వేల రూపాయాలు ఖర్చు పెడతారు. ఒక్కోసారి దీంతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి.

Glowing Skin Tips: ముఖానికి రెట్టింపు నిగారింపు రావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఈ సందర్భంగా పార్లర్లకు కూడా వెళ్లి వేల రూపాయాలు ఖర్చు పెడతారు. ఒక్కోసారి దీంతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. అయితే, ఏ ఖర్చు లేకుండా కేవలం పూల నీళ్లతో మీ ముఖం మెరిసిపోతుంది. అది ఎలానో తెలుసుకుందాం.
 

1 /6

మందారపూవుతో ముఖానికి రెట్టింపు నిగారింపు వస్తుంది. ఇందులో విటమిన్ సి ,విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో మీ చర్మం నునుపుగా మారుతుంది. మీ చర్మం నిత్యయవ్వనంగా మారుతుంది.  

2 /6

మందారపూవుతో నీటిని తయారు చేసుకోవాలి. ఇది రోజ్‌ వాటర్‌ మాదిరి మంచి టోనర్‌లా ఉపయోగపడుతంఉది. దీనికి ఓ 3 మందారపూలను తీసుకుని తగినన్ని నీళ్లు పోసి తక్కువ మంట మీద వేడిచేయాలి.  

3 /6

ఆ తర్వాత మందార నీటిని చల్లారబరచాలి. ఇప్పుడు ఈ నీటిని ఓ బాటిల్‌ల్లోకి తీసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఇది మంచి టోనర్‌గా ఉపయోగించవచ్చు. అంతేకాదు ఏదైనా ఫేస్‌ ప్యాకులు ఉపయోగించినప్పుడు కూడా అందులో ఈ నీటిని ఉపయోగించాలి. మంచి గ్లో వస్తుంది.  

4 /6

మందార నీటిలో మీ ముఖాన్ని స్ప్రే చేసుకుంటూ ఉంటే మీ చర్మం తక్కువ సమయంలోనే రెట్టింపు నిగారింపుతో నునుపుగా మారుతుంది. దీంతో మీరు వేలు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు ఇంట్లోనే మీ ముఖం సహజసిద్ధంగా మెరిసిపోతుంది.  

5 /6

మందార నీటిని ప్యాక్‌లో కూడా వేసుకుని ఉపయోగించవచ్చు. 2 చెంచాల ముల్తానీ మట్టి ,2 చెంచాల పెరుగు కలపాలి. మందార నీటిని అవసరమైన మేరకు మిక్స్ చేయాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి. ఓ అరగంట తర్వాత సాధారణ నీటితో ఫేస్‌వాష్‌ చేసుకోవాలి.  

6 /6

ఈ ప్యాక్‌ వారానికి రెండు సార్లు ముఖానికి వేసుకోవడం వల్ల మంచి గ్లోతోపాటు చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )