Ganesh chaturthi in AP: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై AP High court నిర్ణయం

Vinayaka chavithi celebrations in AP: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. 

High court directions on Vinayaka chavithi celebrations in AP: ఈ సందర్భంగా ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన హైకోర్టు.. పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు (Ganesh idols) పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 

1 /6

కరోనావైరస్ వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వచ్చిన వినాయక చవితి పండగపై (Ganesh Chaturthi festival 2021) ఏపీ హై కోర్టు తమ అభిప్రాయం వెల్లడించింది.

2 /6

బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం (AP govt) తీసుకున్న నిర్ణయమే సరైందని హైకోర్టు అభిప్రాయపడింది. 

3 /6

మత పరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు లేనందునే ప్రైవేటు వేదికలపై వేడుకలకు అనుమతిస్తున్నట్టు హైకోర్టు (AP High court) స్పష్టం చేసింది. (Image credits : IANS photo)

4 /6

కోవిడ్-19 నిబంధనలకు లోబడి ఐదుగురికి మించకుండా పూజలు (Ganesh puja vidhi) చేసుకోవాలని కోర్టు సూచించింది. 

5 /6

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తేల్చిచెప్పింది. 

6 /6

రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉన్నందున.. కోవిడ్ నిబంధనలు (COVID-19) పాటిస్తూ ప్రైవేటు స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించుకునే వారికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది.  Also read : Ganesh Chaturthi: వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలపై ఏపీ సర్కారుకి Pawan Kalyan ప్రశ్నలు Also read : Vinayaka Chaturthi: సీఎం జగన్ పెళ్లి రోజు వేడుకలకు కరోనా అడ్డం రాలేదా: నారా లోకేష్