Gabbar Singh Re Release: ప్రెజెంట్ టాలీవుడ్లో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రూట్లో ఓల్డ్ బ్లాక్ బస్టర్ సినిమాలను 4K ఫార్మాట్లో రీ ప్రింట్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.
Gabbar Singh Re Release: ఈ మధ్య ఈ రీ రిలీజ్ ట్రెండ్ తగ్గినట్టు కనిపించినా.. తాజాగా మహేష్ బాబు ‘మురారి’ సినిమా మంచి వసూళ్లను సాధించడంతో మళ్లీ తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. అయితే.. ‘బ్రో’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా రిలీజ్ కాలేదు. అందుకే ఈ పుట్టినరోజున ‘గబ్బర్ సింగ్’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రకంగా పవన్ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారు ఫ్యాన్స్.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించినా.. ‘గబ్బర్ సింగ్’ కు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ‘ఖుషీ’ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం దాదాపు 10 యేళ్లు వెయిట్ చేసారు అభిమానులు. వాళ్ల ఆకలి తీరేలా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డులను బ్రేక్ చేసింది
‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనిరిజమ్స్, డైలాగ్స్, యాక్షన్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసాయి. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా పెద్ద ఎస్సెట్ గా నిలిచింది.
హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్’ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించిన ప్రేక్షకులతో కెవ్వు కేక పుట్టించేలా చేసాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ సినిమా పరమేశ్వర ప్రొడక్షన్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించాడు. ఈ సినిమా అప్పట్లోనే 306 కేంద్రాల్లో 50 రోజులు, 65 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకొని సంచలనం సృష్టించింది.
అంతేకాదు అప్పట్లోనే ఈ సినిమా రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘గబ్బర్ సింగ్’.. మొత్తంగా రూ. 60.16 కోట్ల షేర్ (రూ. 115 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు హరీష్ శంకర్ టేకింగ్ తోడై ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
‘గబ్బర్ సింగ్’ సినిమా రీ రిలీజ్ లో మురారి సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ తో పాటు.. ఆ సినిమా రీ రిలీజ్ లో కలెక్ట్ చేసిన వసూళ్లను క్రాస్ చేయాల్సి ఉంటుంది. మరి రీ రిలీజ్ లో ‘గబ్బర్ సింగ్’.. ‘మురారి’ సినిమా సెట్ చేసిన రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.