Real Estate: బాలీవుడ్ నటులు.. రియల్ ఎస్టేట్ కింగ్‌లు.. వందల కోట్ల పెట్టుబడి పెడుతున్న వీరులు ఎవరంటే

Real Estate: బాలీవుడ్ తారలు అనగానే..యాక్టింగ్ తోపాటు ప్యాషన్ ఇవే గుర్తుకు వస్తుంటాయి. కానీ వీరిలో మరో కోణం కూడా ఉంది. డబ్బును ఎక్కడ ఎలా ఉపయోగించాలో వారికి బాగా తెలుసు. చాలా మంది బి-టౌన్ స్టార్లు తమ డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడతారు. 2024లో చాలా మంది తారలు రియల్ ఎస్టేట్‌లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఓ స్టార్ 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈస్టార్లు ఎవరో తెలుసుకుందాం. 
 

1 /7

Real Estate: చేతిలో నాలుగు రూపాయలు ఉన్నప్పుడు వాటిని సరిగ్గా ప్లాన్ ప్రకారం ఖర్చు పెడితే ఎలాంటి ఆర్థిక కష్టాలు రావు. అయితే చాలా మంది బాలీవుడ్ నటులు ఈ ఫార్మూలాను వంటపట్టించుకున్నారు. వారు నటనలో సంపాదించే కోట్లాది రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడుతుంటారు. బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సినిమాల్లో నటించడం ద్వారా చాలా డబ్బు సంపాదిస్తారు. ఒక్కో సినిమాకు కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు. సినిమాలే కాకుండా యాడ్స్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు తమ డబ్బును లగ్జరీ వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. మరికొందరు తమ సొంత వ్యాపారాలు ప్రారంభించారు. అయితే కొంతమంది తారలు మాత్రం రియల్ ఎస్టేట్‌పై ఫోకస్ పెట్టారు.  

2 /7

బి-టౌన్‌లోని చాలా మంది సినీ తారలు తమ డబ్బును ఖర్చు చేయకుండా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారు. 2024 సంవత్సరంలో, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు సంబంధించి చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు చర్చలో ఉన్నాయి. ఈ ఏడాది కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన టాప్ 5 తారలు ఎవరో చూద్దాం.   

3 /7

షాహెన్‌షా 100 కోట్లు:  2024లో రియల్ ఎస్టేట్‌లో అత్యధికంగా పెట్టుబడి పెట్టిన స్టార్ అమితాబ్ బచ్చన్ . బచ్చన్ కుటుంబం కలిసి రియల్ ఎస్టేట్‌లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టింది. స్క్వేర్ యార్డ్స్ ప్రకారం, అమితాబ్ బచ్చన్ రూ.70 కోట్లు, అభిషేక్ బచ్చన్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారు.  

4 /7

షాహిద్ కపూర్ 50కోట్లు:  ఉడ్తా పంజాబ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ కూడా పెట్టుబడుల్లో వెనుకంజ వేయలేదు. ఈ ఏడాది మేలో రూ.58 కోట్ల విలువైన సీ-వ్యూ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఇండెక్స్ ట్యాప్ ప్రకారం, ఈ అపార్ట్మెంట్ వర్లీలోని ఒబెరాయ్ త్రీ సిక్స్టీ వెస్ట్ ప్రాజెక్ట్‌లో ఉంది.  

5 /7

దీపికా పదుకొణె : అగ్ర నటి దీపికా పదుకొణె రియల్‌ ఎస్టేట్‌లో మాస్టర్‌ మైండ్‌ కూడా. జాప్కీ ప్రకారం, ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో, యువ నటి సంస్థ KA ఎంటర్‌ప్రైజెస్ ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో రూ. 17.8 కోట్లకు ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఈ అపార్ట్‌మెంట్ సారా రేషం కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 15వ అంతస్తులో ఉంది.   

6 /7

తృప్తి దిమ్రీ: కాలా, బుల్బుల్ ఫేమ్ నటి తృప్తి దిమ్రీ  అదృష్టం యానిమల్ చిత్రంతో మారింది. నటి ఈ ఏడాది జూన్‌లో బంగ్లాను కొనుగోలు చేసింది. ఇండెక్స్ ట్యాప్ ప్రకారం, తృప్తి  రెండు అంతస్తుల బంగ్లా విలువ సుమారు రూ. 14 కోట్లు.  ఇది వెస్ట్ బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో ఉంది. 

7 /7

అమీర్ ఖాన్ కోట్లు ఖర్చు: 2024లో, అమీర్ ఖాన్ పేరు సినిమాల గురించి కాకుండా రియల్ ఎస్టేట్ పెట్టుబడి గురించి చర్చలో ఉంది. స్క్వేర్ యార్డ్స్ ప్రకారం, నటుడు బాంద్రాలోని పాలి హిల్‌లోని బెల్లా విస్టా అపార్ట్‌మెంట్‌లో 9 కోట్ల రూపాయల విలువైన రెడి-టు-మూవ్-ఇన్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసాడు.