Free Gas Cylinders: ఉచిత గ్యాస్‌ పథకానికి అప్లై చేస్తున్నారా? ఈ కార్డు ఉంటేనే ఫ్రీ సిలిండర్‌..!

Free Gas Cylinders In Ap Eligibility: ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉచిత గ్యాస్‌ సిలిండర్‌లపై కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి మూడు సిలిండర్‌లు అర్హులైన వారికి అందించనుంది. అయితే, ఈ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఏపీ ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పొందాలంటే కావాల్సిన అర్హత, పత్రాలను తెలుసుకుందాం.
 

1 /5

ఈ ఉచిత సిలిండర్‌ పథకానికి రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.2,600 పైగా భారం పడనుంది. ఏడాదికి మూడు సిలిండర్లు అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.  

2 /5

ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందాలంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా బీపీఎల్‌ కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. ఇప్పటికే వీరు గ్యాస్‌ కనెక్షన్‌ కలిగి ఉండాలి.  

3 /5

అంతేకాదు ఒక వేళ ఉజ్వల గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి అర్హులై ఉంటే వారు ఈజీగా ఈ పథకానికి అర్హులు అవుతారు. ఉజ్వల ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో ఆర్థికంగా వెనుకబడిన అర్హులైన కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ అందిస్తుంది. ఈ పథకానికి అర్హులైన వారు సులభంగా ఏపీ ప్రభుత్వం అందించే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్‌ పథకానికి కూడా అర్హులు.  

4 /5

అంతేకాదు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌కు దరఖాస్తు చేసుకునేవారు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. వారు కచ్చితంగా రేషన్‌ కార్డు కూడా కలిగి ఉండాలి. వారి నివాస ధృవీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, కరెంటు బిల్లు, ఇప్పటికే కలిగి ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ వివరాలు కూడా కలిగి ఉండాలి.  

5 /5

ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మీ వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.  అర్హులైనవారి జాబితాను సంబంధిత అధికారులు క్షుణ్నంగా పరిశీలించి రెడీ చేస్తారు. ఈ పథకం ద్వారా అర్హులైన వారు అందరికీ వర్తింపజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇటీవలె ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ కోసం భారీ క్యూలైన్లలో ఏజేన్సీల వద్ద నిలబడి కేవైసీ కూడా పూర్తి చేశారు.