Salary Hike: ఉద్యోగులకు రూ.25,000 వరకు జీతాలు పెంపు.. 8వ వేతన సంఘం బంపర్‌ అప్డేట్‌..

8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. దీంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. దీంతో వారి జీతం ఏకంగా రూ.25,000 పెరగనున్నాయి. మొన్నే 7వ వేతన సంఘం డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అయితే, ఈ వేతన సంఘం ఏర్పడి ఇప్పటికే పదేళ్లు కావస్తుంది.
 

1 /5

మీడియా నివేదికల ప్రకారం 2025 ప్రారంభంలో కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయవచ్చు. దీంతో వారి జీతాలు కూడా భారీగా పెరుగుతాయి. అంతేకాదు ఉద్యోగులు కూడా 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొత్త కమిషన్‌ ఏర్పడితే వారి జీతాలు కూడా దాదాపు 44 శాతం పెరుగుతాయి.  

2 /5

అయితే, ఈ కొత్త వేతన సంఘం ఏర్పాటుకు 2025 ప్రారంభంలో జరగనుంది. దీనికి ఆర్థిక నిపుణుల కొన్ని సిఫార్సులు కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలు ఇప్పటికే కేంద్రానికి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ లేఖ రాశారు.2025 బడ్జెట్‌లో 8వ వేతన సంఘం గురించి పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం అందిచనుంది.  

3 /5

ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశం సమయంలో కూడా ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, నేషనల్‌ కౌన్సెల్‌ జాయింట్‌ అడ్వైజరీ, రైల్వే టెక్నికల్‌ సూపర్‌వైజర్ అసోసియేషన్‌ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిదవ వేతన సంఘం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కేంద్రానికి లేఖలు రాశారు.   

4 /5

ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ జీతాలతో లింక్‌ అయి ఉంటుంది. దీని పెరుగుదలతో ఉద్యోగుల జీతాలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ కొత్త కమిషన్‌ ఏర్పాటుతో ఫిట్మెంట్‌ 2.57 నుంచి 3.68 పెరుగుతుంది. దీంతో ఉద్యోగుల జీతాలు కూడా రూ.25,000 వరకు పెరుగుతుంది. ఈ పెంపుతో ఉద్యోగుల జీతం కనీసం రూ.34,560, పింఛను రూ.17,280 డీఏ లేదా డీర్‌గా నిర్ణయించవచ్చు అని అంచనా వేస్తున్నారు.  

5 /5

ఈ 8వ వేతన సంఘం ఏర్పాటుతో 48 లక్షల మంది ఉద్యోగులు 67 లక్షల మంది పింఛనుదారులకు లబ్ది చేకూరనుంది. ఇదిలా ఉండగా చివరగా ఫిట్మెంట్‌ 2016 ఏడాదిలో పెరిగింది.