జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు జరిగిన కాల్పులలో ఆయన మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.03 నిమిషాలకు షింజో మృతి చెందినట్లు సమాచారం.
నరా నగరంలోని ఓ వీధిలో లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా షింజో అబే స్పీచ్ ఇస్తుండగా.. ఓ దుండగుడు వెనుక నుంచి వచ్చి ఆయనను తుపాకీతో కాల్చాడు. రెండు రౌండ్లు కాల్చడంతో అబె ఛాతీ పట్టుకుని వేదికపైనే కుప్పకూలారు.
వేదికపైనే కుప్పకూలిన జపాన్ మాజీ ప్రధానిని హుటాహుటిన ఆస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు. కానీ 67 ఏళ్ల అబే హాస్పిటల్‌లో ప్రాణాలు వదిలారు.
కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల అనంతరం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అడ్డుకుని ఘటనాస్థలంలోనే పట్టుకున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఓ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దుండగుడు నరా నగరానికి చెందిన 41 ఏళ్ల యమగామి ఎట్సుయాగా పోలీసులు గుర్తించారు. యమగామి గతంలో సైన్యంలో పనిచేసినట్లు సమాచారం తెలుస్తోంది.
అనారోగ్య కారణాల రీత్యా షింజో అబే ప్రధాని పదవికి 2020లో రాజీనామా చేశారు. అయినా కూడా ఆయన రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నారు. జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్నారు. 2006-2007, 2012-2020 వరకు ఆయన దేశ ప్రధానిగా ఉన్నారు.
Authored By:
P Sampath Kumar
Publish Later:
No
Publish At:
Friday, July 8, 2022 - 17:14
Mobile Title:
Shinzo Abe Dies: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి.. పట్టుబడిన షూటర్! ఫొటోస్ ఇవే
Request Count:
130
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.