Ugadi 2024-2025 Festival: మనలో ప్రతి ఒక్కరు కూడా ఉగాది పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తెలుగు నూతన సంవత్సరంను భక్తితో స్వాగతం పలుకుతారు. ఉదయం నుంచి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.
ఉగాదిని యుగాది.. అంటూ నూతన సంవత్సరానికి ఆరంభమని కూడా చెప్తుంటారు. ఈరోజున ఏపనిచేసిన, ఎలాంటి పనులు తలపెట్టిన మనకు ఏడాదంతా అలాంటి ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్యులు చెబుతుంటారు.
ముఖ్యంగా ఉగాది రోజున చాలా మంది ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. అదే విధంగా కొందరి ఇళ్లలో మాత్రం దేవాలయంకాస్త ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడి గుడి శుభ్రం చేసేటప్పుడు గుడిలో ఉన్న దేవుడి విగ్రహాలను జాగ్రత్తగా మరోక ప్రదేశంలోకి షిప్ట్ చేయాలి. అంతేకాకుండా స్నానం చేసి మాత్రమే దేవుడి గుడిని శుభ్రం చేయాలి.
ఆలయంలో ఎక్కడ కూడా బూజు లాంటివి ఉండకుండా క్లీన్ చేసుకొవాలి. కొందరు దేవుడి మీద నుంచి తీసిన పుష్పాలను ఇంట్లోనే రోజుల తరబడి ఉంచుతుంటారు. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా.. మొదటగా చింతపండు లేదా నిమ్మతో దేవుడి విగ్రహం శుభ్రంగా కడుక్కొవాలి
దేవుడి ఆలయం క్లీన్ గా బూజుదులిపి, తడిబట్ట వేసిన తర్వాతనే దేవుడి విగ్రహాలను తిరిగి యథా స్థానంలో పెట్టాలి. అదే విధంగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణం వంటివి పెట్టాలి. ఇంట్లో దేవుడికి వేసిన బట్టలు కొందరునెలల తరబడి అస్సలు మార్చరు. అలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతు ఉంటాయి. ఎంత ఇబ్బందులున్న వారినికి ఒకసారైన కూడా దేవుడి వస్త్రాలను మార్చాలి
దేవుడి ఆలయంలో ప్రత్యేంకంగా పంచపాల ఉండేలా చూసుకొవాలి. దేవుడికి పెట్టే కుంకుమ, పసుపులను ప్రత్యేకంగా పెట్టాలి. మనం బొట్టుపెట్టుకొవడానికి ఉపయోగించినవి తిరిగిదేవుడికి పెట్టడానికి ఉపయోగించకూడదు. అదే విధంగా.. దేవుడి ఆలయలో ఎక్కువగా పటాలు పెట్టుకోకుండా దేవుళ్లు తక్కువగా ఉన్న పూజలు భక్తితో కొలవడం ఎక్కువగా చేయాలి.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)