Amazon Flipkart Discount Offers: వైర్‌లెస్ ఇయర్ బడ్స్, హెడ్‌ఫోన్స్‌పై భారీ ఆఫర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక డీల్స్ ఇవే

Amazon Flipkart Discount Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ ప్రత్యేక డిస్కౌంట్ సేల్స్ ప్రారంభించాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, ఇయర్‌బడ్స్, స్మార్ట్ వాచెస్ ఇలా ఏది కొనే ఆలోచన ఉన్నా ఒకసారి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ చెక్ చేసుకోండి.

Amazon Flipkart Discount Offers: అటు అమెజాన్ ఇటు ఫ్లిప్‌కార్ట్ రెండింట్లో ఇయర్ బడ్స్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 పేరుతో, ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ 2024 పేరుతో ఈ డిస్కౌంట్ సేల్స్ నడుస్తున్నాయి. టాప్ 4 ఇయర్ బడ్స్ బ్రాండ్లపై ఉన్న డీల్స్ గురించి ఇప్పుడు చెక్ చేద్దాం.

1 /5

అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ రెండింట్లోనూ టాప్ బ్రాండెడ్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అందులో వన్‌ప్లస్, ఒప్పో, సోనీ, జేబీఎల్ వంటి బ్రాండ్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ టాప్ 4 ఇయర్ బడ్స్ ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకుందాం.

2 /5

Oppo Enco Air3 Pro price and Features ఇవి కాంపోజిట్ టాంబూ ఫైటర్ డయాఫ్రమ్ కలిగి ఉంటాయి. 49 డెసిబుల్స్ వరకూ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కలిగి ఉంటాయి. ఐపీ 55 రేటింగ్ కలిగి ఉంటాయి. కేస్ ఛార్జింగ్ 30 గంటలు నిలబడుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో కేవలం 3,799 రూపాయలకే లభిస్తున్నాయి. 

3 /5

OnePlus Nord Buds 2 Price and Features వన్ప్లస్ నార్డ్ బడ్స్ 2 బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అని చెప్పవచ్చు. అద్భుతమైన డిజైన్, ఐపీ 55 రేటింగ్ కలిగి ఉంటాయి. 12.4 ఎంఎం డైనమిక్ టైటానియం డ్రైవర్ల ద్వారా ఎనర్జీ పొందుతాయి. నాలుగు మైక్రో ఫోన్స్ కలిగి ఉంటాయి. ఇవి 25 డెసిబుల్స్ వరకూ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అందిస్తాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 7 గంటలు పనిచేస్తుంది. అమెజాన్ ప్రత్యేక సేల్‌లో 2,398 రూపాయలకు లభిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు 500 రూపాయలు అదనపు డిస్కౌంట్ ఉంటుంది.

4 /5

Sony WH-CH720N Head phones Price and Features ఇవి చాలా లైట్ వెయిట్. కేవలం 192 గ్రాముల బరువుంటాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 50 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంటుంది. ఇది కూడా మల్టీ పాయింట్ కనెక్టివిటీ, అడాప్టివ్ సౌండ్ కంట్రోల్, గూగుల్ అసిస్ట్ , అలెక్సా వంటి ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ ప్రత్యేక సేల్‌లో 8,989 రూపాయలకు అందుబాటులో ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ఈఎంఐపై కొనుగోలు చేస్తే మరో 1500 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది

5 /5

JBL Tune 770NC Head phones price and Features అద్భుతమైన వాయిస్ క్లియరెన్స్, సౌండ్ ఎఫెక్ట్ అంటే జేబీఎల్ మాత్రమే. యాక్టివ్ నాయిక్ క్యాన్సిలేషన్ అందించే హెడ్ ఫోన్స్‌లో జేబీఎల్ బెస్ట్ ఆప్షన్. సిగ్నేచర్ ప్యూర్ బాస్ సౌండ్ టెక్నాలజీతో 70 గంటలు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఏఎన్‌సి ఆన్ మోడ్లో ఉంటే 44 గంటలు పనిచేస్తుంది. ఇది బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కలిగి ఉంది. ఒకే సమయంలో రెండు గ్యాడ్జెట్స్ కనెక్ట్ చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో 5,998 రూపాయలకు లభిస్తోంది.