Calcium Rich Foods: కాల్షియం అధికంగా ఉండే 6 బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్స్

పాలను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్ వంటి పోషకాలతో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అయితే కొన్ని ఇతర ఆహార పదార్ధాల్లో కూడా పాల కంటే ఎక్కువగా ఐరన్, కాల్షియం పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Calcium Rich Foods: పాలను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్ వంటి పోషకాలతో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అయితే కొన్ని ఇతర ఆహార పదార్ధాల్లో కూడా పాల కంటే ఎక్కువగా ఐరన్, కాల్షియం పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

1 /6

చియా సీడ్స్ ఇందులో కాల్షియం పెద్దఎత్తున ఉంటుంది. 28.35 గ్రాముల చియా సీడ్స్‌లో 179 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. చియా సీడ్స్‌లో ఇంకా ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి12 ఉంటాయి.

2 /6

టేఫు టేఫులో కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. 100 గ్రాముల టేఫు తీసుకుంటే అందులో 689 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల పన్నీరులో  597 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దాంతో బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది

3 /6

ఎముకలు, పళ్లకు బలం కాల్షియం అనేది ఓ అత్యవసరమైన పోషకం. శరీరంలో ఎముకల్ని, పళ్లను పటిష్టంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. పాలు, పన్నీరు, పెరుగు వంటి పదార్ధాల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఒకవేళ పాలు ఇష్టం లేకపోతే ఇంకా కొన్ని పదార్ధాలు ఉన్నాయి. 

4 /6

ఆకు కూరలు పాలకూర, తోటకూర, చుక్కకూర వంటి ఆకు కూరల్లో కాల్షియం చాలా అవసరమైన పోషకం. ప్రతి 100 గ్రాముల పాలకూరలో 99 మిల్లీగ్రాముల కాల్షియం, 2.2 గ్రాముల ఫైబర్, 2.86 గ్రాముల ప్రోటీన్, 2.71 గ్రాముల ఐరన్ ఉంటుంది. 

5 /6

బాదం, సోయా బీన్స్, ఓట్ మిల్క్ శాకాహారులకు పాలు కాకుండా ఓట్ మిల్స్, బాదం, సోయా బీన్స్ వంటి పదార్ధాలు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో కాల్షియంతో పాటు ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. 

6 /6

బాదం డ్రై ఫ్రూట్స్ అన్నింటిలోనూ బాదంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల బాదంలో 269 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇందులో హెల్తీ ఫ్యాట్, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ ఉంటుంది.