Face Mask Mistakes: ముఖానికి మాస్క్ ధరిస్తున్నారా, అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు

Face Mask Common Mistakes | భారతదేశంలో మరోసారి కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఇదివరకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా యోచిస్తున్నాయి. గురువారం ఒక్కరోజే గత 24 గంటల్లో 2 లక్షలకు పైగా కొత్త కోవిడ్10 కేసులు దేశ వ్యాప్తంగా నిర్ధారించారు. కరోనా టీకాలు కొన్ని వయసుల వారే తీసుకునేందుకు అవకాశం ఉండగా, యువత నుంచి 45 ఏళ్లులోపు వారిలోనే కరోనా మరణాలు అధికంగా కనిపిస్తున్నాయి.

1 /6

ముఖ్యంగా టీనేజ్ దాటిన వారి నుంచి 45 ఏళ్ల వయసు వారిలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఎందుకు వీరు ఉద్యోగం కోసం పని ప్రదేశాలకు వెళ్లడమే ఓ కారణంగా తెలుస్తోంది. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ముఖానికి మాస్క్(Face Mask) తప్పనిసరి ధరించాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే మాస్కులు ధరించే సమయంలో ఈ తప్పిదాలు మాత్రం చేయకూడదు. ఆ వివరాలు మీకోసం. Also Read: New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి

2 /6

కొందరు తాము ధరించిన మాస్కులను ముక్కు నుంచి కిందకి లాగుతుంటారు. ఇలా పదే పదే మాస్కును ముక్కు నుంచి కిందకి లాగడం ద్వారా కోవిడ్19 వైరస్ మీకు సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక మాస్కులను నోరు, ముక్కు, దవడ భాగం నిండుగా కప్పి ఉంచేలా తగిన ఫేస్ మాస్కులు ధరించాలి.

3 /6

మాస్కులను రెండు చేతులతో తీసుకుని జాగ్రత్తగా తొడగాలి. కొందరు ఒక చేతితోగానీ నిర్లక్ష్యంగా ఫేస్ మాస్కు ధరిస్తుంటారు. ఇది మీ ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. మీ ముక్కు, నోరు, దవడ భాగం పూర్తిగా కప్పి ఉంటే మాస్కులు కొనుక్కుని ధరించాలి. మాస్కులను పదే పదే తాకకూడదని తెలుసుకోండి. మీ చేతికి ఉన్న క్రిములు, వైరస్ మాస్కుకు అంటుకుంటాయి. Also Read: CoronaVirus Cases In India: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడానికి కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి

4 /6

ఫేస్ మాస్కును మీరు తొలగించిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మీ వెంట శానిటైజర్ ఉంటే అవసరమైన సమయంలో చేతులు శుభ్రం చేసుకోవాలని మరిచిపోకూడదు. మాట్లాడే సమయంలో మాస్కును ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకి లాగకూడదు.

5 /6

బట్టతో సాధారణంగా ఇళ్లల్లో కుట్టే మాస్కులు ధరించినా కరోనాకు మార్గం వేసినట్లు అవుతుంది. కనుక ఒకవేళ అలా కుడితే కచ్చితంగా కొన్ని లేయర్లు వచ్చేలా మందంగా ఉండేలా మాస్కును కుట్టించుకోవాలి. లేదా నాలుగైదు లేయర్స్ ఉండేలా మాస్కులు కొనుక్కుని ధరించడం వల్ల కరోనా వైరస్ మీ దరిచేరదు. Also Read: Covid-19 Deaths: ఎండలకు, కరోనా మరణాలకు ఉన్న లింక్‌పై నిపుణులు తేల్చిన విషయం ఇదే

6 /6

వేసవికాలంలో అధికంగా చెమట సమస్య ఎదుర్కొంటాం. కనుక ఎండలో బయట తిరిగే వ్యక్తులు మాస్కులు తడిదనంగా మారితే, ఈ మాస్కు తొలగించి వేరే మాస్కులను ధరించడం ఉత్తమం. తడిగా ఉన్న మాస్కులతో బయట తిరిగితే కరోనా వైరస్ మీ ముక్కుద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.