PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే పీఎం కిసాన్‌ డబ్బులు రూ.4000, అర్హులు వీళ్లే..

PM Kisan Yojana: పీఎం కిసాన్‌ సమృద్ది యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఖాతాల్లో ప్రతి ఏడాదికి మూడు సార్లు రూ.2000 జమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఏడాదికి రూ.6,000 అందిస్తుంది కేంద్రం. ఇటీవలె అక్టబర్ 5వ తేదీ 18 విడుత నిధులను కూడా మంజూరు చేసింది. 
 

1 /5

పీఎం కిసాన్‌ యోజనలో 19వ విడుత నిధులను కూడా ఫిబ్రవరిలో మంజూరు చేస్తున్నట్లు ఇటీవలె తెలిసింది. అయితే, ఈకేవైసీ పూర్తి కాకపోవడంతో 18వ  విడుత డబ్బులు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రైతులకు అందలేదు.  

2 /5

కేవైసీని ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. లేదా దగ్గరలోని సీఎస్‌సీ సెంటర్లకు వెళ్లినా వారు కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు.   

3 /5

pmkisan.gov.in ద్వారా కూడా కేవైసీ, స్టేటస్‌ ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఈ అధికారిక వెబ్‌సైట్‌లోనే పీఎం కిసాన్‌ యోజనకు కొత్తగా దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు. అయితే, కేవైసీ పూర్తి చేసుకున్నవారికి 19వ విడుతలో ఒకేసారి రూ.4000 జమా కానున్నాయి.  

4 /5

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్‌ యోజన ద్వారా చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకుంటుంది. ఈ పథకాన్ని 2019లో ప్రారంభించింది. ప్రతి ఏడాది రూ.6000 రైతుల ఖాతాల్లో జమా చేస్తుంది.  

5 /5

పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగానే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దీనికి మీ వద్ద ఆధార్‌ కార్డు, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌, భూమి పత్రాలు కలిగి ఉండాలి.