EPFO Pension Rules: పీఎఫ్‌ ఖాతారులు తప్పకుండా తెలుసుకోండి.. ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయో తెలుసా..!

EPFO Latest News: పీఎఫ్‌ ఖాతాదారులు రిటైర్‌మెంట్ తరువాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఈపీఎఫ్‌ఓ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌ కింద సంఘటిత రంగంలోని కార్మికులు 58 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్‌కు పొందేందుకు అర్హులవుతారు. ఒకే యూఎఎన్‌ కింద కనీసం పదేళ్లు అయినా పనిచేసిన వారికి పెన్షన్ పొందుతారు. మొత్తం 7 రకాల పెన్షన్లు పొందొచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
 

1 /8

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ రూపంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) చందాదారులు 58 సంవత్సరాల తరువాత పెన్షన్‌కు అర్హత ఉంటుంది.  

2 /8

పీఎఫ్‌ ఖాతాదారులు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్‌ను పూర్తి చేసి ఉంటే.. 58 సంవత్సరాల వయస్సు నిండిన తరువాత పెన్షన్ అందుకుంటారు.  

3 /8

ఒక ఈపీఎఫ్‌ సభ్యుడు 50 ఏళ్లు పైబడి 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి.. ఆ తరువాత ఈపీఎఫ్‌ లేని కంపెనీలో చేరినా అతను పెన్షన్ పొందుతాడు. అయితే ఈ పెన్షన్ 58 ఏళ్ల పదవీ విరమణ వయస్సుతో పోలిస్తే ప్రతి సంవత్సరం 4 శాతం తక్కువగా ఉంటుంది.   

4 /8

ఉదాహరణకు ఓ వ్యక్తి 58 సంవత్సరాల వయస్సులో నెలవారీ రూ.10 వేల పెన్షన్‌కు అర్హత ఉంటే.. అతను 57 సంవత్సరాల వయస్సులో రూ.9,600, 56 సంవత్సరాల వయస్సులో రూ.9,200 పెన్షన్ అందుకుంటారు.  

5 /8

పీఎఫ్‌ ఖాతాదారుడు ప్రమాదవశాత్తు వైకల్యానికి గురైతే (శాశ్వత లేదా తాత్కాలిక) పెన్షన్‌కు పొందేందుకు అర్హులు. ఈ పెన్షన్‌ కోసం 10 ఏళ్ల సర్వీసు లేదా కనీస వయస్సు 50 ఏళ్లు పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఒక నెల ఈపీఎఫ్‌ఓకు కంట్రిబ్యూట్ చేసినా కూడా పెన్షన్ అందుకుంటారు.   

6 /8

ఒకవేళ పీఎఫ్‌ చందాదారుడు మరణిస్తే.. సభ్యుడి జీవిత భాగస్వామికి ఆర్థిక సహాయాన్ని ఈపీఎఫ్‌ఓ నిర్ధారిస్తుంది. జీవిత భాగస్వామికి నెలవారీ పెన్షన్‌ను అందిస్తుంది. EPS 95 కింద చైల్డ్ పెన్షన్ మరణించిన EPFO ​​సభ్యుడి ఇద్దరు పిల్లలకు ఏకకాలంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు నెలవారీ పెన్షన్‌ అందుకుంటారు. పెళ్లికాకపోతే.. తండ్రికి పెన్షన్ ఇస్తారు.  

7 /8

మరణించిన సభ్యుడి భార్య అప్పటికే మరణించి ఉంటే.. సభ్యుడి పిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తారు. నెలవారీ పెన్షన్ మొత్తం చెల్లిస్తారు.   

8 /8

ఈపీఎఫ్‌ఓ సభ్యుడికి ఎవరూ లేకపోతే.. నామినీగా పేరు ఇచ్చిన వారికి పెన్షన్ అందుతుంది. ఈపీఎఫ్‌ సభ్యులు, వారి కుటుంబాలకు సమగ్రమైన సామాజిక భద్రతా కవరేజీని అందించేందుకు ఈపీఎఫ్‌ఓ అన్ని చర్యలు చేపట్టింది.