Interest Rates On EPF Deposits | కేంద్ర ప్రభుత్వం, EPFO సంస్థలు ఈపీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈపీఎఫ్ నగదు నిల్వలలపై వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
EPFO Interest Rate | ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఖాతాదారులుగా ఉన్నారు. ఇటీవల వీరికి 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో ఈపీఎఫ్వో, కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ జమచేసింది. అయితే కొందరు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ ఖాతాకు నగదు రాలేదని ఆందోళన చెందుతున్నారు. Also Read: EPFO: మరోసారి తగ్గనున్న PF Interest Rate, మోదీ ప్రభుత్వంలో వడ్డీ రేట్లు ఇలా మారాయి
EPF Interest Rate | ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, EPFO సంస్థలు ఈపీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈపీఎఫ్ నగదు నిల్వలలపై వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మార్చి 4వ తేదీన సమావేశమై ఈపీఎఫ్వో, కేంద్ర మంత్రిత్వ శాఖలు దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నాయి. Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి
Interest Rate On EPF | ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు శ్రీనగర్లో సమావేశమై 2020-2021 ఏడాదికి సంబంధించి EPF Interest Ratesపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈపీఎఫ్ నగదుపై వడ్డీ రేట్లను తగ్గించనున్నారని కథనాలు వస్తున్నాయి. మార్చి 4న దీనిపై స్పష్టత రానుంది. Also Read: EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే
ప్రస్తుతం ఈపీఎఫ్వో ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీని అందిస్తున్నారు. అయితే తాజా సమావేశంలో వడ్డీ రేట్లు కనుక తగ్గించినట్లయితే, కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న 2020-21 సంవత్సరానికిగానూ EPFO ఖాతాదారులు 8.5 శాతానికన్నా తక్కువ వడ్డీ అందుకుంటారు. Also Read: EPFO: ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త PF Tax Rules, దీని ప్రభావం ఇలా ఉండనుంది
ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, LPG సిలిండర్ ధరలు భారీగా పెరుగుతుంటే, మరోవైపు ఈపీఎఫ్ వడ్డీ రేట్లు తగ్గడం EPFO ఖాతాదారులకు పిడుగులాంటి వార్త కానుంది. ఒకవేళ ఈపీఎఫ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే 7ఏళ్ల కనిష్టానికి చేరనుండటం (8.5 శాతం కన్నా తక్కువ కావడం) గమనార్హం.